English   

ప‌వ‌న్ ఏం చేస్తున్నాడో అర్థ‌మౌతుందా..?

ప‌వ‌న్ ఏదో చేయాల‌ని చూస్తున్నాడు. రాజ‌కీయాల్లో ఇప్ప‌టికే ఆ వైపుగా అడుగేస్తున్నాడు గానీ ఇప్పుడు సినిమాల ప‌రంగా కూడా ప‌వ‌ర్ స్టార్ ఏదో మాయ చేయ‌డానికి ట్రై చేస్తున్నాడు. లేక‌పోతే మ‌రేంటి.. త‌న 20 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి మూడు సినిమాల‌కు క‌మిట‌య్యాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ మూడింట్లో కాట‌మ‌రాయుడు విడుద‌లైంది. ఇప్పుడు మ‌రో రెండు సినిమాలున్నాయి. ఇంత‌లోనే మ‌రో సినిమాకి కూడా క‌మిట‌య్యాడు ప‌వ‌ర్ స్టార్. అయితే ఉన్న టైమ్ చాలా త‌క్కువ‌. ఈ గ్యాప్ లోనే ఇన్నేసి సినిమాలు పవ‌న్ పూర్తి చేస్తాడా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. 
2019 ఎల‌క్ష‌న్స్ కు ప‌వ‌న్ సిద్ధం అవుతోన్న త‌రుణంలో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తాడా అనేది ఆస‌క్తిక‌ర‌మే. కాట‌మ‌రాయుడు 
సెట్స్ పై ఉండ‌గానే.. జిల్లా ఫేమ్ ఆర్ టీ నీస‌న్ తో ఓ సినిమా మొద‌లుపెట్టాడు ప‌వ‌ర్ స్టార్. ఏఎం ర‌త్నం నిర్మించ‌బోయే ఈ చిత్రం త‌మిళ్ లో సూప‌ర్ హిట్టైన వేదాళంకు రీమేక్. ఇదిలా ఉండ‌గానే.. త్రివిక్ర‌మ్ సినిమాను సైతం ప‌వ‌న్ మొద‌లుపెట్టేసాడు. గ‌తేడాది న‌వంబ‌ర్ 5న సైలెంట్ గా రాధాకృష్ణ ఆఫీస్ లో త్రివిక్ర‌మ్ సినిమా మొద‌లైంది. డాలి, త్రివిక్ర‌మ్, నీస‌న్.. ఈ ముగ్గురిలో డాలి అయిపోయింది.. త్రివిక్ర‌మ్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక మిగిలింది నీస‌న్. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం.. ఆర్టీ నీసన్ సినిమా ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చని స‌మాచారం. ఇదిలా ఉండ‌గానే తాజాగా సంతోష్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇది ఓ బాలీవుడ్ సినిమాకు రీమేక్ అని స‌మాచారం. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతుంది. మొత్తానికి ఇన్నేసి సినిమాల‌ను ప‌వ‌న్ ఒకేసారి మేనేజ్ చేస్తాడో లేదో చూడాలిక‌.

More Related Stories