English   

సినిమా రావాల్సింది.. టీజ‌ర్ ఇస్తున్నారు..

2-0-Release-Date-Fixed

కొన్నిసార్లు అంతే. మ‌నం ఏదో అనుకుంటే.. ఇంకేదో అవుతుంటుంది. కావాలంటే ఇప్పుడు 2.0 విష‌య‌మే తీసుకోండి. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ కావ‌ట్లేదు. ఇప్పుడు ఎప్రిల్ కు వెళ్లిపోయింది ఈ చిత్రం. కానీ అభిమానులు ఎక్క‌డ బాధ ప‌డ‌తారో అని.. రిలీజ్ డేట్ చెప్పిన రోజు టీజ‌ర్ విడుద‌ల చేసి వాళ్ల‌కు స‌ర్ది చెబుతున్నారు. అవును.. జనవరి 26న రిపబ్లిక్‌ డే కానుకగా 2.0 టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇక చిత్ర ట్రైలర్‌ ను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్ కార‌ణంగానే వాయిదా పడిందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఈ చిత్ర విజువ‌ల్ ఎఫెక్ట్స్ టీం మేనేజ‌ర్ శ్రీనివాస్‌ మోహన్‌ పర్యవేక్షణలో ప్ర‌పంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ చిత్ర విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం పని చేస్తున్నాయి. బాహుబ‌లి తొలి భాగానికి ప‌నిచేసింది ఈయ‌నే. ఇక ఇండియాలో ఇప్పటిదాకా అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 2.0 రికార్డు సృష్టించబోతోంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాజోన్‌, సుధాన్షు పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎప్రిల్లో సినిమా విడుదల కానుంది.. కానీ ఇంకా డేట్ క‌న్ఫ‌ర్మ్ కాలేదు.

More Related Stories