English   

2018లో బాల‌య్య రూలింగ్..

2018-Lo-Balayya-Ruling

అదేంటి ఇప్పుడు బాల‌య్య ఉన్న‌ది కూడా రూలింగ్ పార్టీలోనే క‌దా అనుకుంటున్నారా..? అవి రాజ‌కీయాలు.. ఇవి సినిమాలు. ఈయ‌న రెండింట్లో ర‌చ్చ చేస్తున్నాడు క‌దా..! పైసావ‌సూల్ సెట్స్ పై ఉండ‌గానే కేఎస్ ర‌వికుమార్ మొద‌లుపెట్టాడు. ఇప్పుడు ఈ చిత్రం కూడా 20 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అదేం విచిత్రమో గానీ ఇండ‌స్ట్రీలో ఉన్న మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ అన్నీ వెతుక్కుంటూ మ‌రీ బాల‌య్య ద‌గ్గ‌రికే వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో స‌మ‌ర‌సింహా అన్నా.. ఆ త‌ర్వాత న‌రసింహా అన్నా.. సింహా అన్నా.. లెజెండ్ అన్నా.. ల‌య‌న్ అన్నా.. డిక్టేట‌ర్ అన్నా.. ఇవ‌న్నీ బాల‌య్యకే బాగా సెట్ట‌య్యాయి.

ఇక ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో రానున్నాడు నంద‌మూరి న‌ట‌సింహం. కేఎస్ ర‌వికుమార్ తో ఈయ‌న చేయ‌బోయే సినిమాకు రూల‌ర్ అని టైటిల్ ప్ర‌చారంలో ఉంది. ఇప్ప‌టికే ఈ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిష్ట‌ర్ చేయించాడు నిర్మాత సి క‌ళ్యాణ్. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంది. త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం ద‌గ్గ‌ర 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు కేఎస్. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి రూల‌ర్ అనే టైటిల్ అదిరిపోయిందంటున్నారు నంద‌మూరి ఫ్యాన్స్. సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానుంది. న‌య‌న‌తార ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది.

More Related Stories