English   

ఆ క‌ళ్ల‌తో.. ఆక‌లి పెంచేయ‌కే..!

Aa-Kallatho-Akali-Pencheyake

ఈ ఫోటోల్లో అను ఎమ్మాన్యువ‌ల్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది క‌దా మ‌రి. సోగ‌క‌ళ్ల‌తో నిజంగానే మాయ చేస్తుంది ఈ మ‌ళ‌యాల ముద్దుగుమ్మ‌. అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్లు.. ఆ క‌ళ్ల‌లో దూకి ఈత కొట్టేయొచ్చేమో..! అను ఎమ్మాన్యువ‌ల్ కు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. వ‌ర‌స‌ సినిమాల‌తో ఊహించిన దానికంటే చాలా త్వ‌ర‌గానే గుర్తింపు తెచ్చుకుంది అను. మ‌జ్ను సినిమాలో క్యూట్ యాక్టింగ్ తో క్రేజ్ తెచ్చుకున్న అను.. ఈ మ‌ధ్యే కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమాతో వ‌చ్చింది. ప‌నిలో ప‌నిగా ఫోటోషూట్ల‌లో కూడా రెచ్చిపోతుంది అను ఎమ్మాన్యువ‌ల్. తాజాగా అమ్మాయిగారు ఓ ఫోటోషూట్ లో చూపుల‌తోనే చంపేస్తున్నారు.

ఓ వైపు ట్రెడీషిన‌ల్ లుక్ లో క‌నిపిస్తూనే.. మ‌రోవైపు ఎక్క‌డెక్కడ ఏయే అందాలు చూపించాలో వాటిని మాత్రం బాగానే హైలైట్ చేసింది అను ఎమ్మాన్యువ‌ల్. ప్ర‌స్తుతం గోపీచంద్ ఆక్సీజన్ తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ సినిమా.. బ‌న్నీ నా పేరు సూర్య‌లో హీరోయిన్ గా న‌టిస్తోంది అను ఎమ్మాన్యువ‌ల్. వీటితోపాటు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోయే చిత్రంలోనూ అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. మ‌రి ఈ సినిమాల‌తో అను ఇమేజ్ ఇంకెంత పెర‌గ‌బోతుందో..?

More Related Stories