English   

త్రిష‌.. నేను సీరియ‌స్ అంటున్న ఆర్య‌...

Actor-Arya-In-Search-Of-His-Life-Partner

పెళ్లికి వ‌య‌సు అయిపోతుంది.. త్వ‌ర‌గా చేసుకోవాలంటూ ఆర్య‌ను ఈ మ‌ధ్య బాగా ఇబ్బంది పెడుతున్నారు. దాంతో విసిగిపోయిన ఆర్య ఏకంగా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. తాను పెళ్లికి రెడీ అని.. త‌న‌కు ఓ అమ్మాయి కావాలంటున్నాడు. అంతేకాదు.. ఫోన్ నెంబ‌ర్ కూడా ఇచ్చాడు. ఆర్య ఇలా ట్వీట్ చేసాడో లేదో మ‌నోన్ని ఆడుకుంటూ కొంద‌రు సెలెబ్రెటీస్ ఆర్య‌కు రీ ట్వీట్లు చేసారు. ఈ లిస్ట్ లో త్రిష, సిద్ధార్థ్‌, జయంరవి, ప్రసన్న, సతీష్‌, రమ్య సుబ్రమణ్యం ట్వీట్ చేసారు. వీళ్లంతా ఆర్య‌కు స్నేహితులే. పైగా త్రిష‌తో ఆయ‌న‌కు ఇంకాస్త ఎక్కువ స్నేహ‌మే ఉంది. అందుకే స్నేహితున్ని ట్విట్ట‌ర్ లో ఆడుకుంది త్రిష‌. వహ్‌ వహ్‌.. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. కానీ నేను నవ్వు ఆపుకోలేకపోతున్నా ఆర్య అని ట్వీట్ చేసింది త్రిష‌. దానికి ఆర్య రిప్లై ఇస్తూ.. నా మాటల్ని నువ్వు ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోవన్నాడు.

వీళ్లిద్ద‌రి ట్వీట్ కాన్వ‌ర్సేష‌న్ ఆస‌క్తిగా మారిందిప్పుడు. నా జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. పెళ్లి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్లు, షరతులు లేవు. మీకు నేను నచ్చితే, నేను మీకు చక్కటి జోడీ అవుతానని మీకు అనిపిస్తే ఫోన్‌ చేయండి. ఇది జోక్‌ కాదు. నా జీవితం అంటూ ఆర్య ఓ వీడియోను ట్విటర్‌లో ఈ మ‌ధ్యే అప్‌లోడ్ చేసాడు. దీనిపైనే ఇప్పుడు ఇష్ట‌మొచ్చిన‌ట్లు రీ ట్వీట్లు వ‌స్తున్నాయి. పైగా అమ్మాయిలు కూడా కాల్ చేస్తున్నారు ఈ హీరోకు. ఈయ‌న ప్రస్తుతం సంఘమిత్ర సినిమాలో నటిస్తున్నారు. బాహుబ‌లి త‌ర‌హాలో సుంద‌ర్ సి ప్లాన్ చేస్తోన్న ఈ సినిమాలో జ‌యం ర‌వి మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు ఆర్య‌. మొత్తానికి మ‌రి ఈ హీరోకు ఇప్ప‌టికైనా అమ్మాయి దొర‌కాల‌ని ఆశిద్ధాం..!

More Related Stories