English   

నాలుగు రోజులు అదిరిపోయింది..

Adirindi-Full-filled-Vijay-s-Dream

కొన్ని సినిమాలపై ఎంత లేట్ అయినా కూడా క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంద‌ని అదిరింది నిరూపించింది. త‌మిళ‌నాట విడుద‌లైన మూడు వారాల‌కు కానీ తెలుగులో ఈ చిత్రానికి మోక్షం రాలేదు. కాస్త ఆల‌స్యంగా వ‌చ్చినా కూడా అదిరిందిని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మ్యూట్ చేసిన జిఎస్టీ డైలాగులు మ‌ళ్లీ వాయిస్ ఇచ్చారు.. ఇక అదిరిందిని విడుద‌లకు ముందు నుంచే కావాల్సిన‌న్ని వివాదాలు చుట్టుముట్టాయి.. ఇవ‌న్నీ కాకుండా సినిమా విడుద‌ల కాకుండ మూడు వారాలు ఆపారంటూ నిర్మాత గ‌గ్గోలు. ఇంత‌గా చేసారంటే సినిమాలో ఏదో ఉంది అనే ఊహ‌లు కూడా ప్రేక్ష‌కుల్లో బాగా పెరిగిపోయాయి.

ఇదే ఇప్పుడు అదిరిందికి హెల్ప్ అవుతున్నాయి. మూడు వారాల త‌ర్వాత విడుద‌లైనా కూడా తెలుగులోనూ అదిరిందికి అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. తెలుగులో క‌నీసం 5 కోట్ల మార్క్ కూడా అందుకోలేని విజ‌య్.. ఈ సారి తొలి నాలుగు రోజుల్లోనే దాన్ని క్రాస్ చేసి ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఉన్న అంచ‌నాలు చూస్తుంటే అదిరిందికి సుల‌భంగానే 8 కోట్లు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. విజ‌య్ తెలుగులో వ‌చ్చిన ఈ విజ‌యాన్ని ఎలా వాడుకోబోతున్నాడో..?

More Related Stories