English   

అజ్ఞాత‌వాసి ఫ‌స్ట్ టాక్ ఏంటి..? 

Agnathavasi-Talk

అజ్ఞాత‌వాసి తొలి షో ప‌డిపోయింది. ఇప్ప‌టికే చాలా చోట్ల ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. వాటి నుంచి టాక్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఓవ‌ర్సీస్ నుంచి వ‌స్తోన్న టాక్ బ‌ట్టి చూస్తుంటే అజ్ఞాత‌వాసి క‌చ్చితంగా ప‌వ‌న్ అభిమానుల‌కు పండ‌గ అని తెలుస్తుంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ చాలా కామెడీగా ఉంద‌ని.. అయితే తొలి అరగంట మాత్రం స్లోగా సాగుతుంద‌ని తెలుస్తుంది. క‌థలోకి తీసుకెళ్ల‌డానికి త్రివిక్ర‌మ్ కాస్త టైమ్ తీసుకున్నాడ‌ని.. కానీ ఒక్క‌సారి క‌థ‌లోకి వెళ్లిన త‌ర్వాత ఎక్క‌డా ఆగ‌లేద‌ని చెబుతున్నారు చూసిన‌వాళ్లు. మ‌రీ ముఖ్యంగా అజ్ఞాత‌వాసిలో అన్న‌య్య‌ను ఫాలో అయిపోయాడు ప‌వ‌ర్ స్టార్. అంటే చిరంజీవి సీన్స్ ను రిఫ‌రెన్స్ కింద తీసుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మెగాస్టార్ రిఫెరెన్స్ వ‌చ్చిన‌పుడు థియేట‌ర్స్ ఊగిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది. ఫ‌స్టాఫ్ లో విల‌న్స్ తో ప‌వ‌న్ ఆడుకునే సీన్స్ అన్నీ ఒక‌ప్పుడు చిరంజీవి సినిమాలను గుర్తుకు చేసే విధంగా ఫ్యాన్స్ కు పండ‌గే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త స్లోగా ఉంద‌ని.. అయితే ఎమోష‌న్స్ మాత్రం బాగున్నాయ‌ని.. ఖుష్బూ పాత్ర‌ను త్రివిక్ర‌మ్ తీర్చిదిద్దిన తీరు బాగుందంటున్నారు ప్రేక్ష‌కులు. మొత్తానికి ఓవ‌ర్సీస్ టాక్ ప్ర‌కారం అయితే అజ్ఞాత‌వాసి పాస్ మార్కుల‌తో బ‌య‌ట‌ప‌డిపోయాడు. మ‌రి ఇక్క‌డ ఎలా ఉంటుందో అస‌లు టాక్ చూడాలిక‌..!

More Related Stories