English   

ప‌వ‌న్ ప‌రువు కాపాడిన రానా

Agnyaathavaasi-release

అవునా.. అదేంటి.. ప‌వ‌న్ ప‌రువును రానా కాపాడ్డం ఏంటి అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్య రానా సినిమాల‌తో పాటు ఇత‌ర ప‌నులు కూడా బాగానే చేస్తున్నాడు. త‌న‌కు కావాల్సిన వాళ్ల కోసం మీడియేట‌ర్ గా మారుతున్నాడు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన శైలిలో సాల్వ్ చేసాడు రానా. ఇక ఇప్పుడు ప‌వ‌న్ స‌మ‌స్య‌ను కూడా రానానే ప‌రిష్క‌రించాడు. అది కూడా ప‌వ‌న్ కొత్త సినిమా అజ్ఞాత‌వాసి విష‌యంలోనే. ఈ చిత్రం కాపీ రైట్ స‌మ‌స్య‌లో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ఆధారంగా తెర‌కెక్కింద‌నే వార్త‌లున్నాయి. ఈ విష‌యంపై నిర్మాత రాధాకృష్ణ కూడా నిజ‌మే అని ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఈ చిత్ర రీమేక్ రైట్స్ టి సిరీస్ ద‌గ్గ‌ర ఉండ‌టంతో వాళ్ల‌కు 10 కోట్లు ఇచ్చి ఇష్యూ సెటిల్ చేసుకున్నారు అజ్ఞాత‌వాసి టీం. 

అజ్ఞాతవాసి టీంకు.. టి సిరీస్ కు మ‌ధ్య‌లో రాజీ కుదిర్చింది రానా అని తెలుస్తుంది. ఈయ‌నే మ‌ధ్య‌లో ఉండి 14 కోట్ల నుంచి బేరాన్ని 10 కోట్ల‌కు తెగ్గొట్టాడ‌ని వార్త‌లున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్ విడుద‌ల కాక‌పోవ‌డానికి కూడా లార్గో వించ్ సినిమానే కార‌ణం అని తెలుస్తుంది. ట్రైల‌ర్ కానీ విడుద‌లైతే అది కాపీ అని తెలుస్తుంద‌నే భ‌యం త్రివిక్ర‌మ్ లో క‌నిపిస్తుందంటున్నారు విశ్లేష‌కులు. అందుకే ఈ చిత్ర ట్రైల‌ర్ ఆల‌స్యం అవుతుంద‌ని స‌మాచారం. జ‌న‌వ‌రి 5నే రావాల్సిన ట్రైల‌ర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. అయితే వెరీ సూన్ అంటూ మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసారిప్పుడు. జ‌న‌వ‌రి 6న ఈ ట్రైల‌ర్ విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. అప్పుడు కూడా వ‌స్తుంద‌నే క్లారిటీ అయితే లేదు. రిలీజ్ కు స‌రిగ్గా నాలుగు రోజులు కూడా లేదు. ఇప్పుడు కానీ ట్రైల‌ర్ వ‌స్తే జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు అదే ర‌చ్చ న‌డుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్ కోసం అభిమానులు ఇంకెంత‌గా 

More Related Stories