English   

 అజ్ఞాత‌వాసి మొద‌టిపోటు అన్న‌య్య‌కే.. 

Agnyaathavaasi- records

అజ్ఞాత‌వాసి అరాచ‌కం సాగుతుంది. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్ర దూకుడు చూసి హాలీవుడ్ సినిమాలు సైతం బెదిరిపోతున్నాయి. అక్క‌డ ప్రీమియ‌ర్స్ నుంచే రికార్డుల మోత మొద‌లైపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమా క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా ఈ రికార్దుల ర‌చ్చ సాగుతుంది. బాహుబ‌లి మిన‌హాయిస్తే మ‌రే సినిమాకు సాధ్యం కాని రికార్డులు సెట్ చేస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్ప‌టికే కేవ‌లం ప్రీమియ‌ర్స్ నుంచే ఈ చిత్రం 1.5 మిలియ‌న్ అందుకునేలా క‌నిపిస్తుంది. పైగా ఓవ‌ర్సీస్ వాళ్ల‌కు అచ్చొచ్చిన మంగ‌ళ‌వారం ప్రీమియ‌ర్స్ కావ‌డంతో అడ్డే లేకుండా పోయింది. అక్క‌డ మంగ‌ళ‌వారం ఆఫ‌ర్స్ చాలా ఉంటాయి. ఇది అజ్ఞాతవాసికి క‌లిసొచ్చింది. తొలిరోజు వ‌సూళ్లతో క‌లిపి దాదాపు 1.8 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూళ్ళు తీసుకురావ‌డం ఖాయ‌మైపోయింది. ఇదే జ‌రిగితే నాన్ బాహుబ‌లి కేట‌గిరీ ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో ఉంటాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్ప‌టికే ఖైదీ నెం.150 పేరుమీదున్న 1.2 మిలియ‌న్ ప్రీమియ‌ర్స్ రికార్డును తమ్ముడు తిర‌గ‌రాసాడు. ఇప్పుడు అన్న‌య్య రికార్డులు మ‌రిన్ని ప‌గ‌ల‌గొట్ట‌డానికి రెడీ అయిపోయాడు ప‌వ‌ర్ స్టార్. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ టూ హాలీవుడ్ అజ్ఞాత‌వాసి ఫీవ‌ర్ తో ఊగిపోతుంది. 

More Related Stories