English   

అల్లుఅర్జున్ ను ప‌డేసిన రెడ్డిగారు..

Allu-Arjun-s-Next-With-A-New-Director

అవును.. నిజంగానే ఇప్పుడు ఓ రెడ్డి అల్లుఅర్జున్ ను ప‌డేసాడు. అది కూడా ఓ ప్రేమ‌క‌థ చెప్పి. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా యాక్ష‌న్ క‌థ‌లే చేస్తోన్న బ‌న్నీకి ఈ మ‌ధ్యే ఓ ప్రేమ‌క‌థ న‌చ్చింది. దాంతో ఆయ‌న‌కు మ‌ళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఆర్య టైమ్ లో ఆయ‌న న‌డిపిన‌ ప్రేమ‌క‌థ‌లు మ‌న‌సును క‌దిలిం చేసాయి. దాంతో అర్జంట్ గా ఇప్పుడు ఓ ప్రేమ‌క‌థ చేసేయాల‌ని ఫిక్సైపోయాడు బ‌న్నీ. ఈ మ‌ధ్య ఆయ‌న చేసినవ‌న్నీ యాక్ష‌న్ సినిమాలే. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న‌ నా పేరు సూర్య కూడా యాక్ష‌న్ సినిమానే. ఆర్య త‌ర్వాత తొలిసారి కొత్త ద‌ర్శ‌కుడికి ఛాన్సివ్వని బ‌న్నీ.. ఇన్నేళ్ళ త‌ర్వాత వ‌క్కంతం వంశీని న‌మ్మాడు. ఈ చిత్రాన్ని ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్, నాగ‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్.

నా పేరు సూర్య షూటింగ్ ప్ర‌స్తుతం గోవాలో జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రం త‌ర్వాత కూడా బ‌న్నీ మ‌ళ్లీ కొత్త ద‌ర్శ‌కుడికే అవ‌కాశమిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్యే బ‌న్నీ ఓ క‌థ విన్నాడ‌ని తెలుస్తోంది. ఈ క‌థ చెప్పిన ద‌ర్శ‌కుడి పేరు సంతోష్ రెడ్డి. ఈయ‌న చెప్పిన క‌థ నా పేరు సూర్య సెట్ లోనే విన్నాడు అల్లు వార‌బ్బాయి. సంతోష్ చెప్పిన లైన్ బ‌న్నీని బాగా ఇంప్రెస్ చేసిందని.. ఆ క‌థ‌పై బ‌న్నీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ క‌థ‌ను త‌ను మెచ్చేలా డెవ‌ల‌ప్ చేసి తీసుకొస్తే.. సినిమా చేస్తాన‌ని మాట కూడా ఇచ్చాడు అల్లుఅర్జున్. మొత్తానికి కెరీర్ లో సుకుమార్ ను త‌ప్ప కొత్త ద‌ర్శ‌కుడిని న‌మ్మ‌ని బ‌న్నీ.. వ‌ర‌స‌గా ఇలా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం వెన‌క ఉన్న మ‌త‌ల‌బేంటో మ‌రి..?

More Related Stories