English   

ఒక్క క్ష‌ణం ఆలోచించు శిరీష్..

Allu-Sirish-And-Akhil-Neck-To-Neck-Battle

ఒకేరోజు రెండు సినిమాలు వ‌చ్చినా.. ఒక రోజు గ్యాప్ లో రెండు సినిమాలు వ‌చ్చినా న‌ష్టం మాత్రం క‌చ్చితంగా ఆ రెండు సినిమాల‌పై ఉంటుంది. కానీ మ‌న హీరోల‌కు ఇది ఎక్క‌డం లేదు. ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ‌టాన్ని ప్ర‌స్టేజియ‌స్ గా తీసుకుంటున్నారు. ఈ మ‌ధ్య అలా వ‌చ్చి న‌ష్టపోయిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మ‌నోళ్లు మార‌డం లేదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ 22న అఖిల్ వ‌స్తున్నాన‌ని చాలా రోజుల కిందే చెప్పాడు. ఈయ‌న హ‌లో ఆ రోజే విడుద‌ల కానుంది. డిసెంబ‌ర్ 21న ఎంసిఏతో నాని రావాల‌ని చూసినా కూడా అఖిల్ తో పోటీ ప‌డితే ఇద్ద‌రికి న‌ష్టం త‌ప్ప‌ద‌ని తెలిసి.. తానే వారం రోజులు ముందుకు వెళ్లిపోయాడు. డిసెంబ‌ర్ 15 ఎంసిఏ విడుద‌ల కానుంది.

అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో డిసెంబ‌ర్ 23న తాను ఉన్నానంటూ ఒక్క క్ష‌ణంతో శిరీష్ వ‌స్తున్నాడు. విఐ ఆనంద్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాల కంటే ఆస‌క్తి బాగుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. అందుకే ఆ ఆస‌క్తి. ఒక్క రోజు గ్యాప్ లో అఖిల్.. శిరీష్ సినిమాలు వ‌స్తే న‌ష్ట క‌చ్చితంగా శిరీష్ కే ఉంటుంది. ఎందుకంటే క్రేజ్ అఖిల్ సినిమాపై ఎక్కువగా ఉంటుంది కాబ‌ట్టి.. కానీ కుందేలు, తాబేలు క‌థ మాత్రం మ‌రిచిపోకూడ‌దు. ఒక్కోసారి సీన్ రివ‌ర్స్ అయినా చెప్ప‌లేం. అందుకే ఈ పోరుపై ఆస‌క్తి పెరిగిపోయిందిప్పుడు. చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు ఎవ‌రైనా మ‌న‌సు మార్చుకుంటారో లేదంటే మొండిగా దూకుతారో..?

More Related Stories