English   

అనీషా ఆంబ్రోస్.. పెంచేసింది అందాల డోస్..

Anisha-Ambrose-New-Hot-Avatar

అనీషా ఆంబ్రోస్.. ఈ పేరు కొంత‌కాలం కింద టాలీవుడ్ లో బాగా వినిపించింది. అలా అని ఈమె ఏదో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది అని కాదు. జ‌స్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ భామ వైపు ఓ క‌న్నేసాడ‌ని అంతే. అవును.. అప్ప‌ట్లో గ‌బ్బ‌ర్ సింగ్ 2లో అనీషా ఆంబ్రోస్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో గానీ స‌డ‌న్ గా అనీషా మాయ‌మై.. కాజ‌ల్ ఆ ప్లేస్ లోకి వ‌చ్చేసింది. కానీ ప‌వ‌న్ తో న‌టించ‌బోతుంది అనే క్రేజే అనీషాను అంద‌రి దృష్టిలో ప‌డేలా చేసింది. అంత‌కుముందు ఈ భామ అలియాస్ జాన‌కీ అనే సినిమాలో న‌టించింద‌నే విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు. కానీ ప‌వ‌న్ పుణ్య‌మా అని.. ఆయ‌న‌తో న‌టించ‌కుండానే క్రేజ్ తెచ్చుకుంది అనీషా.

ప‌వ‌న్ తో న‌టించే అవ‌కాశం మిస్సైనా.. ఆ క్రేజ్ తోనే కొన్ని అవ‌కాశాలు అందుకుంది అనీషా ఆంబ్రోస్. అయితే ఎన్ని సినిమాలు చేసినా అనీషా కెరీర్ మాత్రం గాడిన ప‌డ‌ట్లేదు. దాంతో హీరోయిన్ల ఆయుధమైన‌ అందాల ఆర‌బోత‌ను బ‌య‌టికి తీసింది అనీషా ఆంబ్రోస్. తాజాగా ఓ ఫోటోషూట్ లో అమ్మ‌డు ఫుల్ గా ఎక్స్ పోజింగ్ చేసింది. చిరిగిన ప్యాంట్ ల‌తో కొల‌త‌లు చూపిస్తూ క‌వ్విస్తుంది ఈ వైజాగ్ పిల్ల‌. ఈమె దూకుడు చూస్తుంటే దేనికైనా రెడీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి అన్న‌ట్లుంది. కానీ ద‌ర్శ‌కులే క‌రుణించ‌ట్లేదు. మ‌రి చూడాలిక‌.. ఇప్ప‌టికైనా ఎవ‌రో ఒక‌రు క‌రుణించి అనీషాను ఆదుకోక‌పోరు.

More Related Stories