English   

అనుమానం వ‌ద్దు.. అన్న‌య్య వ‌స్తున్నాడు.. 

Anumanam-Vaddu-Annaya-Vasthunnadu

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం.. మెగా అభిమానుల‌ను ఇప్పుడు అప్పుడు అని ఊరిస్తున్న స‌మ‌యం.. చిరంజీవి ఆర్నెళ్ల క‌ష్టం.. రానే వ‌చ్చింది. సైరా న‌ర‌సింహారెడ్డి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే స‌మయం ఆస‌న్న‌మైంది. ఇప్పుడు అప్పుడు అంటున్న సైరా షూటింగ్ మ‌రికొద్ది గంట‌ల్లో మొద‌లు కానుంది. డిసెంబ‌ర్ 6 నుంచి సైరా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో ఈ చిత్ర తొలి షాట్ తెర‌కెక్కించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఈ మ‌ధ్యే సెట్ల ప‌ని కూడా పూర్త‌యింది. బ్రిటీష్ వాళ్ల‌ను త‌రిమికొట్టిన స్వ‌తంత్ర్య స‌మ‌ర‌వీరుడి క‌థ కావ‌డంతో ఫిజిక్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు మెగాస్టార్. ఇప్ప‌టికే విడుద‌లైన చిరంజీవి లుక్ చూస్తుంటే అన్న‌య్య ఏ రేంజ్ లో ఉండ‌బోతున్నాడో అర్థ‌మైపోతుంది. ఈ పాత్ర కోస‌మే ప్ర‌త్యేకంగా గుర్ర‌పుస్వారి, క‌త్తిసాము కూడా నేర్చుకుంటున్నాడు మెగాస్టార్.

ప్ర‌తీసారి ఏదో ఓ డేట్ చెప్ప‌డం.. అది మిస్ అవ్వ‌డం జ‌రుగుతున్నాయి. కానీ ఈ సారి మాత్రం అలాంటిదేం జ‌రిగేలా క‌నిపించ‌ట్లేదు. డిసెంబ‌ర్ 6న సైరా ప‌ట్టాలెక్క‌డం ఖాయమైపోయింది. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరుతో పాటు హీరోయిన్ న‌య‌న‌తార కూడా ఇదే షెడ్యూల్ పాల్గొన‌బోతుంది. అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్, విజ‌య్ సేతుప‌తి ఇలా స్టార్ క్యాస్ట్ చాలానే ఉన్నారు ఈ చిత్రంలో. షూటింగ్ ఆల‌స్యం కావ‌డానికి ఇది కూడా ఓ కార‌ణ‌మే. అంద‌రి బ‌ల్క్ డేట్స్ ఒకేసారి దొర‌క‌డం అంటే కాస్త క‌ష్ట‌మే. అందుకే డేట్స్ విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత గానీ షూటింగ్ కు వెళ్ల‌కూడ‌ద‌ని చిరు ఆదేశించాడ‌ని తెలుస్తోంది. పైగా విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కబోతుంది సైరా న‌ర‌సింహారెడ్డి. దాంతో అంద‌రూ అనుకున్న‌ట్లు 2018లో ఈ చిత్రం రావట్లేదు. 2019 సంక్రాంతి కానుక‌గా సైరా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories