English   

అర్జున్ రెడ్డి బ్ల‌డీ బోల్డ్ అనేసిన చ‌ర‌ణ్.. 

Arjun-Reddy-Bladi-Glold-Anesena-Charan

ఈ మ‌ధ్య కాలంలో ఓ సినిమా గురించి ఇంత మంది సినిమా పెద్ద‌లు మాట్లాడుకుంది లేదు.. అది కూడా ఓ చిన్న సినిమా గురించి. సినిమా చూసిన త‌ర్వాత వాళ్లు మాట్లాడాల్సిన ప‌ని లేక‌పోయినా కూడా ప‌ని గ‌ట్టుకుని మ‌రీ ఆ సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నారు. అదే అర్జున్ రెడ్డి. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా అర్జున్ రెడ్డి చూసాడు. మొన్న‌టికి మొన్న అనుష్క ఈ చిత్రం గురించి చెబితే.. ఇప్పుడు త‌న ఫేస్ బుక్ పేజీలో అర్జున్ రెడ్డి గురించి త‌నకు అనిపించింది రాసుకొచ్చాడు మెగా వార‌సుడు. రా అండ్ బ్ల‌డీ బోల్డ్ ఫిల్మ్.. హ్యాట్సాఫ్ టూ విజ‌య్, సందీప్, రాహుల్ రామ‌కృష్ణ‌, శాలిని అండ్ హోల్ టీం అంటూ పోస్ట్ చేసాడు చ‌ర‌ణ్. ఈయ‌న సందేశం అర్జున్ రెడ్డి టీంకు కూడా బాగా బూస్ట‌ప్ ఇస్తుంది. ఒక్క‌ర్ని కాకుండా సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించాడు రామ్ చ‌ర‌ణ్. మొత్తానికి సెలెబ్రెటీస్ ట్వీట్స్.. బ‌య‌ట వివాదాల‌తోనే ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు కాకుండా ఫ్రీగా ప‌బ్లిసిటీ అందుకున్నాడు అర్జున్ రెడ్డి. ఇప్పుడు అది క‌లెక్ష‌న్ల రూపంలోనూ క‌నిపిస్తుంది క‌దా..! ఇప్ప‌టికే 25 కోట్ల షేర్ అందుకుంది ఈ చిత్రం. ఈ మ‌ధ్య కాలంలో ఇంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఎప్పుడూ రాలేదు.

More Related Stories