English   

చిన్నారి పెళ్లికూతురు వేడి పుట్టిస్తుందిగా.. 

Avika-Gor-Sizzling-Looks

అతిచిన్న వ‌యసులోనే.. రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ నే సంపాదించుకుంది అవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లికూతురు. ప‌దేళ్లు కూడా నిండకుండానే బాలికా వ‌ధు సీరియ‌ల్ తో ఇండియ‌న్ వైడ్ గా పాపుల‌ర్ అయింది ఈ భామ‌. ఇక 18 ఏళ్ల‌కే హీరోయిన్ అయిపోయి తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సినిమాల‌తో ఇక్క‌డ‌ మంచి ఇమేజ్ తెచ్చుకుంది అవికా. అయితే సినిమాల్లో న‌టిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ షోలో మాత్రం హ‌ద్దులు దాట‌లేదు అవికా గోర్. కానీ గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉంటూ అందాలు ఆర‌బోయ‌క‌పోతే నెగ్గుకు రావ‌డం కాస్త క‌ష్ట‌మ‌ని ఇప్పుడిప్పుడే చిన్నారి పెళ్లికూతురికి తెలిసొస్తున్న‌ట్లుంది. అందుకే తాను గ్లామ‌ర్ షోకు సిద్ధ‌మంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు హింట్ ఇస్తుంది ఈ బ్యూటీ.

ఈ మ‌ధ్య బ‌య‌టి ఫంక్ష‌న్ ల‌కు వ‌స్తున్న‌పుడు చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది అవికా. దీనికితోడు ఈ మ‌ధ్య బ‌రువు బాగా త‌గ్గిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. స‌న్న‌బ‌డిన త‌న అందాన్ని చిట్టి పొట్టి కాస్ట్యూమ్స్ లో కెమెరాల‌కు వ‌లేస్తుంది చిన్నారి పెళ్లికూతురు. ఆ మ‌ధ్య ఓ అవార్డ్ ఫంక్ష‌న్ కు వ‌చ్చిన అవికా.. అక్క‌డ కూడా గ్లామ‌ర్ షోనే ఆయుధంగా వాడుకుంది. ఇక ఇప్పుడు ఓ ఫోటోషూట్ లోనూ అవికా అందాల‌న్నీ ఆర‌బోసింది. త‌న లేలేత వ‌య్యారాల‌ను కెమెరాకు అరువిచ్చేసింది. అయితే ఎంత వేడెక్కించినా.. ఈ భామ మొహంలో ఇంకా చిన్నిపిల్ల ల‌క్ష‌ణాలు మాత్రం అలాగే ఉన్నాయంటున్నారు ప్రేక్ష‌కులు.

More Related Stories