English   

కొన్ని గంట‌లే అ..! వివ‌రం తెలియ‌డానికి..!

awe-teaser

పోస్ట‌ర్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తున్న రోజులివి. ఇప్పుడు కానీ త‌మ సినిమా కొత్త‌గా ఉంటుంది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ రాలేదు అని ద‌ర్శ‌క నిర్మాత‌లు గొప్ప‌లు చెప్పుకుంటే న‌వ్వుకుంటున్నారు ప్రేక్ష‌కులు. అందుకే చెప్ప‌డం కూడా మానేసారు. ఒకవేళ చెప్పినా కూడా కొత్త క‌థేం కాదు.. తెలిసిన క‌థ‌లే అందంగా చెప్పాడు మా ద‌ర్శ‌కుడు అంటున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా త‌న సినిమా కొత్త క‌థ‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ త‌ర‌హా క‌థ ఇండియ‌న్ స్క్రీన్ పైనే రాలేద‌నే చెప్పేంత ధైర్యం మాత్రం ఏ నిర్మాత చేయ‌డు. కానీ నాని చేస్తున్నాడు. త‌న వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ పై తాను నిర్మిస్తోన్న తొలి సినిమా అ.. గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఈయ‌న నిర్మిస్తున్నది రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయితే ఇంత‌గా ఎవ‌రూ మాట్లాడుకోరు. కానీ అందులో ఏదో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 9 పోస్ట‌ర్లు విడుద‌లైనా క‌థ‌పై చిన్న క్లూ కూడా దొర‌క‌లేదు. అదే అ..! సినిమా. టైటిల్ తోనే అంద‌ర్నీ ప‌డేసాడు నాని. 

ఇక ఈ చిత్రంలోని ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు కూడా సినిమాపై ఆసక్తి బాగా పెంచేసింది. రెగ్యుల‌ర్ ప్రొడ్యూస‌ర్లు అయితే ఈ క‌థ‌ను చేయ‌రు కాబ‌ట్టే తానే నిర్మాత‌గా మారానంటున్నాడు నాని. అస‌లు అ.. సినిమాలో ఏముందో తెలియ‌క ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇందులో నాని చేప‌గా.. ర‌వితేజ చెట్టుగా న‌టిస్తున్నారు. రెజీనా విల‌న్ గా.. శ్రీ‌ని అస‌వ‌రాల సైంటిస్ట్ గా నిత్యా మీన‌న్ ల‌వ‌బుల్ పాత్ర‌లో.. ఇషారెబ్బా డిఫెరెంట్ కోణంలో.. ప్రియదర్శి ఫేక్ చెఫ్ గా.. కాజ‌ల్ కొత్త‌గా ఉన్నారు. అస‌లు అ.. వెన‌క ఉన్న మిస్ట‌రీ ఏంటో జ‌న‌వ‌రి 4 సాయంత్రం 5 గంట‌ల‌కు తేల‌నుంది. అప్పుడే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానుంది. టీజ‌ర్ తో అయినా నాని ఏం చేస్తున్నాడో అర్థం అవుతుంది. ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ తెర‌కెక్కిస్తున్నాడు. 

More Related Stories