English   

ఆయ‌న క‌లం ప‌దును తెలిసింది..

Ayana-Kalam-Padunu-Telisindi

మాట‌ల‌తో ఆలోచింప‌గ‌ల శ‌క్తి ఒక్క రైట‌ర్ కే ఉంటుంది. మంచి ర‌చ‌యిత ద‌ర్శ‌కుడైతే అందులోని మాట‌లు కూడా చాలా అర్థ‌వంతంగా ఉంటాయి. ఈ విష‌యాన్ని ఇది వ‌ర‌కే ప్రూవ్ చేసాడు క్రాంతిమాధ‌వ్. ఈయ‌న చేసిన ఓన‌మాలు.. మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు సినిమాలే దీనికి నిద‌ర్శ‌నం. ఈ రెండు సినిమాల్లో ఓ బుక్ ప్రింట్ చేసుకునేన్ని మంచి డైలాగులు రాసాడు క్రాంతిమాధ‌వ్. ఇక ఇప్పుడు ఉంగ‌రాల రాంబాబులోనూ త‌న పెన్ ప‌వ‌ర్ చూపించాడు. సునీల్ ఉన్నాడు క‌దా కామెడీ చేద్దాం అనుకోకుండా.. అర్థ‌వంత‌మైన డైలాగుల‌తో అబ్బో అనిపించాడు క్రాంతి. ముఖ్యంగా ప్ర‌కాశ్ రాజ్ తో చెప్పిన కాళ్లు ప‌ట్టుకోగ‌లం.. క‌త్తులు ప‌ట్టుకోగ‌లం రైతులం క‌దా అనే డైలాగ్ మాత్రం అద్భుతం. ఇక ఇండియా వెన‌క‌బ‌డుతుంది డ‌బ్బు లేక కాదు మాన‌వ‌త్వం లేక‌.. ఎన్నో ఇండ‌స్ట్రీల‌కు ఆస‌రాగా ఉండే వ్య‌వ‌సాయాన్ని మాత్రం ప్ర‌భుత్వం ఎందుకు ఇండ‌స్ట్రీగా గుర్తించ‌దు అనే డైలాగ్.. ఇలా ట్రైల‌ర్ నిండా అద్భుత‌మైన డైలాగులు రాసాడు క్రాంతిమాధ‌వ్. ఒక్క ట్రైల‌ర్ లోనే ఇన్ని ఉంటే రేపు సినిమాలో ఇంకెన్ని ఉంటాయో మ‌రి.. సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Related Stories