English   

మ‌రో ఫ్యాక్ష‌న్ స్టోరీతో బాల‌కృష్ణుడు..

Balakrishnudu-Trailer-Review

బాల‌కృష్ణుడు అంటే మ‌న బాల‌య్య అనుకునేరు. ఇక్క‌డ బాల‌కృష్ణుడు అంటే నారా రోహిత్. ఈ టైటిల్ పెట్టుకుని వ‌స్తున్నాడు నారా వార‌బ్బాయి. ఒక్క హిట్ అంటూ చాలాకాలంగా దండ‌యాత్ర చేస్తోన్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ఏకంగా ఫ్యాక్ష‌న్ క‌థ‌నే న‌మ్ముకుని వ‌స్తున్నాడు. ఈయ‌న న‌టించిన బాల‌కృష్ణుడు ప‌క్కా ఫ్యాక్ష‌న్ సినిమా. ర‌మ్య‌కృష్ణ‌తో పాటు అజ‌య్ కూడా ఇందులో కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ప‌వ‌న్ మ‌ల్లెల తెర‌కెక్కించిన ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఫ్యాక్ష‌న్ క‌థ అంటే పాత చింత‌కాయ ప‌చ్చ‌డి కంటే పాత‌దైపోయింది. ఇలాంటి స‌మ‌యంలో మ‌రోసారి ఫ్యాక్ష‌న్ గొడ‌వలు రుచి చూపింప‌డానికి వ‌స్తున్నాడు నారా రోహిత్. ఈయ‌న న‌టించిన బాల‌కృష్ణుడు ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూస్తుంటే బి గోపాల్, శీనువైట్ల సినిమా సీడీలు ఒకే డీవిడిలో వేసుకుని చూసిన‌ట్లుంది. అటు కామెడీ.. ఇటు యాక్ష‌న్ తో బాల‌కృష్ణుడు ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగానే ఉంది. పైగా చివ‌ర్లో అస‌లైన ఫ్యాక్ష‌న్ సినిమా చూసి చాలా కాల‌మైంది అంటూ డైలాగ్ కూడా పెట్టాడు డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల‌.

శంక‌ర‌, జ్యో అచ్చుతానంద త‌ర్వాత రెజీనాతో నారా రోహిత్ కలిసి న‌టించిన సినిమా ఇది. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. ఇవి కాకుండా వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. సుధీర్ బాబు ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ ఇద్ద‌రు క‌లిసి శ‌మంత‌క‌మ‌ణిలో న‌టించారు. ఇక దీంతోపాటు పండ‌గ‌లా దిగివ‌చ్చాడు కూడా ఉంది. తాజాగా త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన బాణం ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరితో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు. ఇలా ఒక్కో సినిమా లెక్క క్లియ‌ర్ చేస్తున్నాడు నారా రోహిత్. ఇప్ప‌టికైతే ఒక‌ట్రెండు హిట్ల‌తో కెరీర్ ను లాగిస్తోన్న నారా రోహిత్.. త‌న కెరీర్ ను మార్చే సాలిడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తున్నాడు. మ‌రి వీటిలో ఏ సినిమా అది రోహిత్ కు ఇస్తుందో చూడాలిక‌..!

More Related Stories