English   

ఇది భాగ‌మ‌తి అడ్డా.. లెక్క‌లు తేలుస్తా

Anushka-Bhagamathie

తెలుగు ఇండ‌స్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆప్ష‌న్ అనుష్క‌. ఆమె న‌టించిందంటే చాలు సినిమాపై అంచ‌నాలు భారీగా ఉంటాయి. అప్ప‌ట్లో అరుంధతి.. ఈ మ‌ధ్యే రుద్రమదేవి లాంటి సినిమాల‌తో అనుష్క సినిమాలు హీరోల‌తో స‌మానంగా వ‌సూలు చేసి చూపించాయి. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వ‌స్తుంది అనుష్క‌. దాని పేరు భాగ‌మ‌తి. టైటిల్ చూస్తుంటే అరుంధ‌తి గుర్తుకొస్తుంది.. ట్రైల‌ర్ చూసినా అదే గుర్తొస్తుంది. ఈ చిత్ర టీజర్ ఇప్ప‌టికే సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ అయితే ఇంకా అంచ‌నాలు పెంచేసింది. 

సాప్ట్ గా ఉండే అమ్మాయి పాత్ర‌లో అనుష్క ఎంట్రీ ఇవ్వడం.. ఊరి కోసం మంచి చేయడం.. ఆ త‌ర్వాత వెంట‌నే జైలుకు వెళ్ల‌డం.. అక్క‌డ్నుంచి పాతబంగ్లాలో బంధించడం.. అక్కడ ఓ అదృశ్యశక్తి అనుష్కను వెంటాడటం.. ఇవ‌న్నీ ఆస‌క్తి పుట్టించాయి. చివ‌ర్లో ఎవరు పడితే వారు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వనంటూ అనుష్క పలికిన డైలాగులు కేక పెట్టించాయి. ముఖ్యంగా ఆ గెట‌ప్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. పిల్ల జ‌మీందార్ త‌ర్వాత హిట్ లేని అశోక్ భాగ‌మ‌తిపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. అన్న‌ట్లు ఈ చిత్రంలో అనుష్క బాగా స‌న్న‌బ‌డింది. మ‌రి ఇది గ్రాఫిక్స్ మాయా.. లేదంటే నిజంగానే స‌న్న‌బ‌డిందా అనేది తెలియాలి..!

More Related Stories