English   

శీనువైట్ల‌కు చివ‌ర్లో మ‌ళ్లీ షాక్..

Big-Shock-To-Srinu-Vaitla

అన్నీ బాగున్నాయి అనుకున్న టైమ్ లో ఏదీ గుర్తుకు రాదు. అప్పుడు టైమ్ కూడా బాగానే క‌లిసొస్తుంది. కానీ బ్యాడ్ టైమ్ లోనే అన్నీ క‌లిసొచ్చి మ‌రీ తిప్ప‌లు పెడుతుంటాయి. ఇప్పుడు శీనువైట్ల‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. పాపం ఈ ద‌ర్శ‌కుడు ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వ‌చ్చాడో.. మూడేళ్ల కింద ఈయ‌న‌తో సినిమా అంటే ఎగిరి గంతేసిన హీరోలంతా ఇప్పుడు ఈయ‌న్నుంచి త‌ప్పించుకుని తిరుగుతున్నారు. దానికి కార‌ణం మూడు భారీ డిజాస్ట‌ర్లు. ఆగ‌డు.. బ్రూస్ లీ.. మిస్ట‌ర్ మూడు భారీ న‌ష్టాల‌నే తీసుకొచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరోలే కాదు.. చిన్న హీరోలు కూడా శీనువైట్ల అంటే ఆలోచిస్తున్నారు.

ఇన్నాళ్లూ ఏదో చేస్తాడులే.. మిస్ట‌ర్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడులే అనుకున్నారంతా. కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత వైట్ల గారి బుర్ర‌పైనే డౌట్లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ర‌వితేజ‌ను ఆశ్ర‌యించాడు ఈ ద‌ర్శ‌కుడు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రం నిర్మించ‌నున్నారు. అయితే ఇప్ప‌ట్లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌ట్లేదు. త‌మ క‌మిట్ మెంట్స్ పూర్తైన త‌ర్వాత కానీ ర‌వితేజ‌-శీనువైట్ల సినిమా ప‌ట్టాలెక్క‌దంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఇదే జ‌రిగితే వైట్ల‌కు మ‌రింత ఆల‌స్యం త‌ప్ప‌దు. ఈ లోపు ఆయ‌న వెబ్ సిరీస్ చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు శీనువైట్ల‌. ఇప్పుడు వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ కూడా త‌క్కువేం కాదు. పైగా వైట్ల‌కి కామెడీపై మంచి ప‌ట్టుంది. అందుకే ర‌వితేజ సినిమా వ‌ర్క‌వుట్ అయ్యేలోపు ఓ వెబ్ సిరీస్ చేయాల‌నే ప్లాన్ చేస్తున్నాడు శీనువైట్ల‌.

More Related Stories