English   

అ..! ఆ సినిమాపై బాలీవుడ్ లో చ‌ర్చ‌

Awe Teaser-talk

సినిమా విడుద‌ల కాలేదు.. క‌నీసం ట్రైల‌ర్ కూడా రాలేదు.. ఎలా ఉంటుందో.. ఉండ‌బోతుందో తెలియ‌దు. ఇంకా ఏమీ కాక‌ముందే ఆ సినిమా రీమేక్ గురించి బాలీవుడ్ లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంత‌కీ ఏంటా సినిమా అనుకుంటున్నారా..? న‌్యాచుర‌ల్ స్టార్ నిర్మాత‌గా మారి చేస్తోన్న అ..! గురించే ఇప్పుడు చ‌ర్చ అంతా. బాలీవుడ్ లో ఈ సినిమా రీమేక్ గురించి ఇప్ప‌టికే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. బాలీవుడ్ టాప్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ కూడా ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి టీజ‌ర్ చూడ‌లేదంటూ ట్వీటేసాడు. దాంతో సినిమాపై ఇంకాస్త ఆస‌క్తి పెరిగిపోయింది. దానికి త‌గ్గ‌ట్లుగానే టీజ‌ర్ కూడా చాలా కొత్త‌గా ఉంది. కొత్త ద‌ర్శ‌కుడైనా కూడా ఏ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కాలేదు.. క‌థ విష‌యంలో అస్స‌లు క‌న్ఫ్యూజ్ కాలేదు ప్ర‌శాంత్. 

రొటీన్ క‌థ‌ల‌తో విసిగిపోయిన ప్రేక్ష‌కుల కోసం వ‌స్తోన్న సినిమా ఇది అంటున్నాడు నాని. టీజ‌ర్ చూసిన త‌ర్వాత నానిది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కాదు.. ఓన్లీ కాన్ఫిడెన్స్ అని అర్థ‌మైపోయింది. నిమిషం టీజ‌ర్ లోనే సినిమాలోని 9 పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్. టీజ‌ర్ మొద‌ట్లోనే నాని చేప‌గా.. ర‌వితేజ చెట్టుగా క‌నిపించారు. వాళ్ళ వాయిస్ తోనే టీజ‌ర్ మొద‌లైంది కూడా. ఈ చిత్రంలోని ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు కూడా సినిమాపై ఆసక్తి బాగా పెంచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఇలాంటి చిత్రం రాలేదంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇక రెజీనా విల‌న్ గా.. శ్రీ‌నివాస్ అస‌వ‌రాల ఏదో సైంటిస్ట్ గా.. నిత్యా మీన‌న్ ల‌వ‌బుల్ పాత్ర‌లో.. ఇషారెబ్బా డిఫెరెంట్ కోణంలో.. ప్రియదర్శి ఫేక్ చెఫ్ గా న‌టిస్తున్నారు. అస‌లు అ.. వెన‌క ఉన్న మిస్ట‌రీ ఏంటో టీజ‌ర్ తోనైనా తెలుస్తుంద‌నుకున్నారు కానీ ఈ టీజ‌ర్ తోనే ఇంకా ఆస‌క్తి పెంచేసాడు నాని. టీజ‌ర్ తో క్లారిటీ ఇవ్వ‌డం మానేసి.. మ‌రింత క‌న్ఫ్యూజ్ చేసాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు సినిమా ఎలా ఉండ‌బోతుందా అని ఆలోచిస్తూ ఉండ‌ట‌మే..!

More Related Stories