English   

బాల‌య్య‌తో మూడోసారి సిద్ధం.. 

Boyapati-Teamed-Up-With-Balayya-Third-Time

బాల‌య్య‌కు కొంద‌రు ద‌ర్శ‌కుల‌తో భ‌లే సింక్ అవుతుంది. వాళ్ల కాంబినేష‌న్ ఎప్పుడు వ‌చ్చినా కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తాయి. ఒక‌ప్పుడు కోడి రామ‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత బి గోపాల్ తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసాడు బాల‌య్య‌. ఓ ర‌కంగా ఆయ‌న కెరీర్ ను పీక్స్ కు తీసుకెళ్లిన ద‌ర్శ‌కులు వాళ్లే. ఆ రేంజ్ లో బాల‌య్య‌తో మాయ చేస్తున్న ఈ తరం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. మిగిలిన ద‌ర్శ‌కులంతా ఫ్లాపులిస్తున్న స‌మ‌యంలో సింహా సినిమా చేసి బాల‌య్య కెరీర్ కు ఊపిరి ఊదాడు బోయ‌పాటి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడా బాల‌య్య‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు బోయ‌పాటి శీను.

జ‌య జాన‌కీ నాయ‌కా ఫ్లాప్ అయినా కూడా బోయ‌పాటికి వ‌చ్చిన న‌ష్ట‌మేం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న బాల‌య్య కోస‌మే క‌థ సిద్ధం చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది జూన్ నుంచి బాల‌య్య‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు బోయ‌పాటి శీను. ఇది కూడా ప‌వ‌ర్ ఫుల్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉండ‌బోతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories