English   

చౌద‌రి గార‌మ్మాయిని కాస్త ప‌ట్టించుకోండి

chandini- chowdary

మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో న‌టిస్తేనే కొంద‌రు హీరోయిన్ల‌కు గుర్తింపు రాదు. కానీ షార్ట్ ఫిల్మ్స్ తోనే కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది చాందిని చౌద‌రి. ఓ విధంగా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్ కు రారాణి. అప్ప‌ట్లో ఏడాదికి క‌నీసం ప‌ది షార్ట్ ఫిల్మ్ చేసేది ఈ ముద్దుగుమ్మ. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. తెలుగమ్మాయిల‌ను తెలుగులో ప‌ట్టించుకోర‌నే నానుడి మ‌రోసారి చాందిని విష‌యంలోనూ ప్రూవ్ అయింది. ఇక్క‌డ ఏ హీరో క‌రుణించ‌డం లేదు ఈ పాపను. దాంతో వ‌చ్చిన అవ‌కాశాల‌నే వాడేసుకుంటుంది చౌద‌రి గార‌మ్మాయి. ప్ర‌స్తుతం  హౌరాబ్రిడ్జ్ సినిమా చేస్తోంది చాందిని. ఈ సినిమా కూడా ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అందాల రాక్ష‌సి ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో హాట్ హాట్ గా ద‌ర్శ‌న‌మిస్తుంది చాందిని. త‌న హాట్ షోతో మ‌తులు పోగొట్టేసింది ఈ భామ‌. చాందిని తీరు చూస్తుంటే సినిమాల్లో రెచ్చిపోవ‌డానికి రెడీ అని సిగ్న‌ల్స్ ఇస్తున్న‌ట్లుంది. చూడాలిక‌.. ఈ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా చౌద‌రి గార‌మ్మాయికి ఏ ద‌ర్శ‌కుడైనా అవ‌కాశం ఇస్తాడో లేదో..?
 

More Related Stories