English   

అవార్డుల‌పై చిరు ఏమ‌న్నారు..?

Chiranjeevi-Warns-Bunny-Vasu

నంది అవార్డులు ఇచ్చి మ‌రీ విమ‌ర్శ‌ల పాలైంది ఏపీ ప్ర‌భుత్వం. ఇవ్వ‌క‌పోయినా బాగున్ను.. ఇచ్చి శ‌త్రువులు అయ్యాం క‌దా అనుకుంటున్నారు ఇప్పుడు టీడిపి నేత‌లు. ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం.. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. కొన్ని అవార్డులు నిజాయితీగా వెళ్లినా.. కొన్ని మాత్రం కావాల‌నే కొంద‌రికి క‌ట్ట‌బెట్టారు. దీనిపై చాలా మంది చాలా ర‌కాలుగా ఇప్ప‌టికే నోరు విప్పారు.. త‌మ ఆవేద‌న చెప్పుకున్నారు. లెజెండ్ కు ఏకంగా 9 అవార్డులు రావ‌డం వెన‌క ప్ర‌భుత్వం.. ఆయ‌న ఎమ్మెల్యే కావ‌డంతో జ్యూరి స‌భ్యులు స్వామిభ‌క్తి చూపించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ విష‌యంపై బాల‌య్య మాట్లాడుతూ అంద‌రికీ స‌రిగ్గానే నంది అవార్డులు ఇచ్చార‌న్నారు. ఇక లెజెండ్ సినిమా అవార్డులు అంద‌రి కృషికి ఫ‌లితం అన్నాడు బాల‌య్య‌.
 
అవార్డుల విష‌యంలో మెగా హీరోల‌కు అన్యాయం జ‌రిగిందంటూ వాద‌న‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి మాత్రం మాట్లాడలేదు. అస‌లు ఈయ‌న ఏమ‌న్నారు.. క‌నీసం లోలోప‌ల అయినా అవార్డుల విష‌యంపై నోరు విప్పారా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఈ విష‌యంపై చిరంజీవి మాట్లాడారు.. కానీ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌న వ‌ర్గానికే చిరు చివాట్లు పెట్టార‌నే టాక్ వినిపిస్తుంది. అవును.. అవార్డుల విష‌యంలో కాస్త ఓవ‌ర్ గా రియాక్ట్ అయిన బ‌న్నీవాసును ఇంటికి పిలిచి మ‌రి చిరంజీవి మంద‌లించాడ‌ని తెలుస్తోంది. అవ‌న‌స‌రంగా మీడియాలో చేసిన ర‌చ్చ‌కు మెగాస్టార్ నుంచి ఆయ‌న‌కు అక్షింత‌లు బాగానే ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. అయితే అవ‌న్నీ బ‌న్నీవాసు మంచి కోస‌మే అంటున్నారు మెగా వ‌ర్గాలు.

తాను కానీ.. త‌న కుటుంబ హీరోలు కూడా ఏనాడూ అవార్డుల కోసం ప‌ని చేయ‌లేద‌ని.. ప్రేక్ష‌కులు చూసి ఇచ్చిన రికార్డులే మ‌న‌కు ముఖ్యమ‌ని చెప్పాడు చిరంజీవి. అంతేకాదు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అంత ఇమేజ్ ఉన్నా ఏనాడైనా ఒక్క అవార్డు అయినా వ‌చ్చిందా.. వాడు ఏమైనా మాట్లాడాడా అంటూ బ‌న్నీవాసుకు క్లాస్ తీసుకున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మీడియా ముందుకెళ్తే మ‌న ప‌రునువు మ‌న‌మే రోడ్డున ప‌డేసుకుంటామా అని సీరియ‌స్ అయ్యాడ‌ని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇక్క‌డితో వదిలెయ్యండి.. ఎవరికి నంది అవార్డులు ప్రకటిస్తే వారు తీసుకుంటారు.. తాను ఏ రోజు అవార్డు వస్తుందని పనిచేయలేదు. ఈ విషయం నీకే కాదు.. అంద‌రికీ తెలుసు అంటూ బ‌న్నీవాసుకు చెప్పాడు చిరంజీవి. మొత్తానికి మెగాస్టార్ మాట్లాడిన మాట‌ల్లో నిజం లేక‌పోలేదు. అవార్డులు రాక‌పోయినా.. మెగా కుటుంబానికి ప్రేక్ష‌కులు ఇచ్చే రికార్డులు ఉన్నాయి క‌దా..!

More Related Stories