English   

ఇప్పుడు ఆ సినిమా అవ‌స‌ర‌మా విక్ర‌మ్..?

Chiyaan-Vikram-10-Endrathukulla-Dubbed-Into-10

కొరివితో తల గోక్కోవ‌డం అంటే ఏంటో తెలుసా..? ఇప్పుడు విక్ర‌మ్ ను అడిగితే స‌రిగ్గా చెప్తాడు దీనికి స‌మాధానం. అస‌లే ఈయ‌న టైమ్ బాగోలేదు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లు పోతుంది. ఇలాంటి టైమ్ లో తెలుగులో మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు విక్ర‌మ్. వ‌చ్చేదేదో హిట్ సినిమాతో కాదు.. రెండేళ్ల కింద త‌మిళ‌నాట డిజాస్ట‌ర్ గా నిలిచిన సినిమాతో. అది కూడా త‌న కెరీర్ ను.. మార్కెట్ ను స‌గానికి ప‌డేసిన సినిమాతో తెలుగులోకి వ‌స్తున్నాడు విక్ర‌మ్. అదే ప‌త్తు ఎంద్రాకుల్లా. తెలుగులో 10 పేరుతో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. స‌మంత హీరోయిన్ కావ‌డంతో ఆమె క్రేజ్ వాడుకో డానికి ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్ర‌మోష‌న్ కూడా మొద‌లుపెట్టారు. విజ‌య్ మిల్ట‌న్ ద‌ర్శ‌కుడు. స‌మంత హాట్ ఫోటోల‌న్నీ విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రం త‌మిళ‌నాట అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.

మ‌రి ఇలాంటి సినిమాతో తెలుగులోకి విక్ర‌మ్ ఎందుకొస్తున్న‌ట్లో ఆయ‌న‌కే తెలియాలి. అన్నట్లు ఈ చిత్ర విడుద‌ల‌కు విక్ర‌మ్ కు ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ చిత్ర నిర్మాత‌లు తెలుగు హ‌క్కుల్ని ఇక్క‌డి వాళ్ల‌కు అమ్మేస్తారు. వాళ్లు విడుద‌ల చేస్తారు. కానీ మ‌ధ్య‌లో బ‌లైపోయేది మాత్రం విక్ర‌మ్. ఇప్పుడు ఈయ‌న మూడు చిత్రాల‌తో  బిజీగా ఉన్నాడు. ధృవ‌న‌క్ష‌త్రం.. సామి 2.. స్కెచ్ సినిమాలు చేస్తున్నాడు విక్ర‌మ్. వీటిలో స్కెచ్.. ధృవ‌న‌క్ష‌త్రం విడుద‌ల‌కు సిద్ధ‌మయ్యాయి. మ‌రి  ఈ సినిమాల్లో ఏది విక్ర‌మ్ కెరీర్ ను కాపాడుతుందో చూడాలిక‌..!

More Related Stories