English   

దిల్ రాజుకు నాని షాక్..

Dil-Raju-In-Dilemma

ఇప్పుడు దిల్ రాజు ఉన్న రేంజ్ కు ఆయ‌న ఏ హీరోనైనా డేట్స్ అడిగితే నో అంటాడా..? క‌చ్చితంగా లేదు. ఎంద‌కుంటే దిల్ రాజు సినిమా అంటేనే కేరాఫ్ సూప‌ర్ హిట్. అవ‌త‌ల హీరో కూడా అదే రేంజ్ ఫామ్ లో ఉంటే.. ఇక్క‌డే వ‌స్తుంది క‌దా అస‌లు స‌మ‌స్య‌..! ఇప్పుడు నాని, దిల్ రాజు మ‌ధ్య ఇదే స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈయ‌న అడిగిన సినిమా నాని చేయ‌న‌న్నాడ‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. క‌థ న‌చ్చ‌క కాదు.. బిజీ కార‌ణం వ‌ల్ల‌. అస‌లు క‌థ ఏంటంటే.. హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూత‌లు పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మిస్తుండ‌టం. రామ‌య్యా వ‌స్తావ‌య్యా ఫ్లాప్.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హిట్.. డిజే యావ‌రేజ్.. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా త‌న బ్యాన‌ర్ లో హ‌రీష్ కు వ‌ర‌స‌గా నాలుగోసారి ఛాన్స్ ఇస్తున్నాడు దిల్ రాజు.

ఆ మ‌ధ్య ఈ చిత్రం కోసం యుఎస్ లొకేష‌న్లు కూడా వెతికాడు హ‌రీష్ శంక‌ర్. దాగుడు మూతలు క‌థ దిల్ రాజు కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో వెంట‌నే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొమ్మ‌ని చెప్పాడ‌ని తెలుస్తుంది. ముందుగా చెప్పిన‌ట్లుగానే ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇప్ప‌టికే శ‌ర్వానంద్ ఓకే అయ్యాడు. కానీ నాని కోసం ట్రై చేస్తే ఆయ‌న చేయ‌న‌ని మొహంపైనే చెప్పిన‌ట్లు తెలుస్తుంది. దానికి కార‌ణం క‌థ న‌చ్చ‌క కాదు.. ఆల్రెడీ నాగార్జున‌తో నాని ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. దానికి తోడు తాను సోలో హీరోగా బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో దాగుడు మూత‌లు ఆడ‌టం క‌ష్ట‌మ‌ని తేల్చేసాడు నాని. దాంతో హ‌రీష్ శంక‌ర్ మ‌ళ్లీ డైల‌మాలో ప‌డ్డాడు. నితిన్ ఈ క‌థ‌లోకి వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

More Related Stories