English   

మ‌రో సిక్స‌ర్ దిశ‌గా దిల్ రాజు..

dil raju

ఏ నిర్మాత క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని రికార్డును గ‌తేడాది సొంతం చేసుకున్నాడు దిల్ రాజు. ఒకే ఏడాది ఆరు సినిమాలు నిర్మించ‌డ‌మే కాదు.. అన్ని సినిమాలు దాదాపు విజ‌యం సాధించాయి. అందులో రెండు మాత్ర‌మే యావ‌రేజ్ గా ఆడితే.. మిగిలిన నాలుగు సినిమాలు సూప‌ర్ గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. క‌లెక్ష‌న్లు కురిపించాయి. శ‌త‌మానం భ‌వ‌తి నుంచి మొద‌లుపెట్టి.. నేనులోక‌ల్.. డిజే.. ఫిదా.. రాజా ది గ్రేట్.. ఎంసిఏ వ‌ర‌కు అన్నీ వ‌సూళ్ల సునామీ సృష్టించాయి. ఇదే రికార్డ్ అనుకుంటే ఇప్పుడు 2018లోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ ఏడాది కూడా సిక్స‌ర్ కొట్టాల‌ని చూస్తున్నాడు. 

ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఏ సినిమా ఈ ఏడాది విడుదల కాలేదు కానీ చాలా స్పీడ్ గా అన్నీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో మ‌హేశ్- వంశీ పైడిప‌ల్లి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు వంశీ. ఇక ఇదే ఏడాది మార్చ్ లో నితిన్ శ్రీ‌నివాస క‌ళ్యాణం మొద‌లు కానుంది. శ‌త‌మానం భ‌వ‌తిని 45 రోజుల్లోనే పూర్తిచేసిన స‌తీష్ వేగేశ్న ఈ చిత్రం కోసం కూడా ఎక్కువ స‌మ‌యం తీసుకోడు. అంటే ఇది కూడా 2018లోనే రానుంది. ఇక హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూత‌లు సైతం 2018లోనే రానుంది. నితిన్, శ‌ర్వానంద్ ఇందులో హీరోలు. దానికితోడు ఎంసిఏ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ తో ఈ ఏడాది మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

అనిల్ రావిపూడి ఎఫ్ 2 కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. వ‌రుణ్ తేజ్, వెంక‌టేశ్ హీరోలుగా అనిల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. దానికి తోడు శ‌శి అనే కొత్త ద‌ర్శ‌కుడితో అదేనువ్వు అదేనేను అనే సినిమా చేయ‌బోతున్నాడు దిల్ రాజు. ఈ చిత్రంలోనూ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలా ఈ ఏడాది కూడా దాదాపు అర‌డ‌జ‌న్ సినిమాలు.. కుదిర్తే నాలుగు సినిమాలైనా విడుద‌ల చేయాల‌నే క‌సితో ఉన్నాడు ఈ నిర్మాత‌. మ‌రి ఇదే జ‌రిగితే వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ రికార్డ్ తిర‌గ‌రాసిన‌ట్లే..! 

More Related Stories