మాటల్లేవ్.. అయినా వణికిస్తున్నారు..?



Subbaraj-Mercury

మాటల్లేని సినిమా వణికిస్తోంది. అది కూడా ట్రలర్ తోనే. అప్పుడెప్పుడో పుష్పక విమానం తర్వాత వస్తోన్న మూకీ సినిమా ఇదే. కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ఇది. నిజానికి  టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉండాలే గానీ.. హారర్ సినిమాకు భాష అవసరం లేదు. అదే ఈ సినిమాకూ కీ పాయింట్ గాచెబుతున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ అందరిచేతా సూపర్బ్ అనిపించుకుంటోంది. ఏ సైలెంట్ థ్రిల్లర్ అంటూ మొదలైన ఈ టీజర్ ఫైనల్ గా అతి భయంకరమైన అరుపు నిశ్శబ్ధమే అని చెప్పడం హైలెట్. ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ టీజర్ లో అతని లుక్కు భయపెట్టేస్తోందంతే. నటన మరింత వణికిస్తుందంటున్నారు. ఇతర పాత్రల్లో సనత్ రెడ్డి, రమ్య నంబీషన్, దీపక్ పరమేశ్, అనిష్ ప్యాడ్ మాన్ నటిస్తున్నారు. 

1992లో మెర్క్యూరీ అనే పాయిజన్ తో చంపవేయబడ్డ 84మంది కథల నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక భాష లేదు కాబట్టి తమ సినిమాను అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని చెబుతున్నారు. ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇంత టాలెంటెడ్ కాబట్టే దర్శకుడ కార్తీక్ సుబ్బరాజుకు సూపర్ స్టార్ రజినీకాంత్ చాన్స్ ఇచ్చాడు. రజినీ నెక్ట్స్ మూవీ దర్శకుడు కార్తీకే. ఏదేమైనా మూకీ సినిమాకు థ్రిల్లర్ ను యాడ్ చేసి రీ రికార్డింగ్ భయపెట్టాలనుకుంటోన్న ఈ ప్రయత్నం మాత్రం హైలెట్.. 

========== Place the following code before your site's closing tag: