శ్రీ రెడ్డిని బెదిరిస్తోన్న నాగబాబుNaga-Babu-Sri-Reddy

ఈ మాట మేం అనడం లేదు. శ్రీ రెడ్డే అంటోంది. తనకు మెగా ఫ్యామిలీ నుంచి ప్రాణ హాని ఉందని.. ముఖ్యంగా నాగబాబు నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. తనకు ఏమైనా జరిగితే మెగా కుటుంబానిదే బాధ్యత అంటూ ట్విట్టర్ సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది శ్రీ రెడ్డి. అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చాడు. కామ్ గా ఉండాలని చెప్పాడు. తను చెప్పేంత వరకూ ఎవరూ మాట్లాడొద్దని హుకుం జారీ చేశాడు. అయినా పవన్ ఫ్యాన్స్ ఆగడం లేదనీ.. తనకింకా బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని ఆరోపిస్తోంది శ్రీ రెడ్డి. మరోవైపు శ్రీ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పై ట్వీట్లు ఆపడం లేదు. ఒకే వీడియోను ఇన్నిసార్లు ఎందుకు పంపిస్తున్నారని.. అందులో కొందరు మీడియా పెద్దల ఫోటోలు పదేపదే చూపిస్తున్నారని దీనివల్ల  వారిపై దాడిచేయమని మీరే మీ అభిమానులను ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొడుతున్నట్టుగా ఉందని చెప్పుకొస్తోంది. మీడియాను దూరం చేసుకోవడం బాలేదనే సలహాలూ ఇస్తోంది. మరోవైపు రౌడీలను మీ పార్టీలో చేర్చుకోవద్దని వైఎస్ఆర్సీపీకి విజ్ఞప్తి చేసింది. అయితే ఇవన్నీ రొటీన్ గానే ఉన్నా.. ఏకంగా తనకు నాగబాబు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అది నిజమా కాదా అనేది ఎవరి ఊహకు వారికి వదిలేసినా.. ఇంతమంది మెగాఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఉండగా తను నాగబాబు పేరు మాత్రమే ఎందుకు చెప్పిందనేది ఆలోచించాల్సిన విషయమే.. 

========== Place the following code before your site's closing tag: