స‌ల్మాన్ పై కుట్ర జ‌రుగుతుందా..? 



Salman-Khan

లేడీస్ తో అయినా.. లేడీ..స్ తో అయినా పెట్టుకోకూడ‌దు. జీవితానికే చాలా క‌ష్టం. ఇప్పుడు లేడీ..స్ తో అంటే జింక‌ల‌తో పెట్టుకున్నాడు స‌ల్మాన్ ఖాన్. 20 ఏళ్లుగా కృష్ణ‌జింక‌ల కేస్ స‌ల్మాన్ మెడ‌కు చుట్టుకుని ఈ మ‌ధ్యే తీర్పు బ‌య‌టికి వ‌చ్చింది. ఈయ‌న రెండు రోజులుగా జోద్ పూర్ జైల్లోనే ఉన్నాడు. ఈయ‌న‌కు ఐదేళ్ల శిక్ష ఖ‌రారు చేసింది కోర్ట్. దానిపై అభిమానులు బాధ ప‌డుతున్నారు.. ఆయ‌న‌పై పెట్టుబ‌డులు పెట్టిన నిర్మాత‌లు భ‌య ప‌డుతున్నారు.. ఇంట్లో వాళ్లు క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఏముందిలే బెయిల్ తీసుకుని రెండు రోజుల్లో బ‌య‌టికి వ‌చ్చేస్తాడ‌నుకున్నారు కానీ ఇప్పుడు అనుకోని షాక్ త‌గిలింది ఈయ‌న‌కు. ప‌రిస్థితి చూస్తుంటే సల్మాన్ మరికొన్ని రోజులు జైలులో ఉండక త‌ప్పేట్లు లేదు. స‌ల్మాన్ బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషీని ట్రాన్ప్ ఫ‌ర్ చేసింది రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం. 

ఉన్న‌ట్లుండి రాజస్థాన్ లో ఒకే సారి 87 మంది జడ్జీలను ట్రాన్స్ ఫ‌ర్ చేసారు. ఇందులోనే స‌ల్మాన్ కు శిక్ష వేసిన రవీంద్ర కుమార్ జోషీ కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు స‌ల్మాన్ బెయిల్ పిటిష‌న్ పై ఇప్పుడు తేలేది క‌ష్టంగా మారింది. కొత్త జ‌డ్జ్ రావాలి.. ఆయ‌న కేస్ ను పునఃప‌రిశీలించాలి.. అప్పుడు కానీ బెయిల్ రాదు. ఈ ప్రాసెస్ అంతా జ‌ర‌గ‌డానికి మ‌రో ప‌ది రోజులైనా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. నిజానికి సల్మాన్ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై ఎప్రిల్ 7న విచారణ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఉన్న‌ట్లుండి జ‌డ్జ్ ట్రాన్స్ ఫ‌ర్ కావడంతో సల్మాన్ బెయిలు సందిగ్ధంలో పడింది. కావాల‌నే ఇది చేస్తున్నారా లేదంటే అనుకోకుండా అలా జ‌రుగుతుందా అనేది తేలాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడు స‌ల్మాన్ మాత్రం మ‌రికొన్ని రోజులు ఊచ‌లు లెక్క‌పెడుతూ ఉండాల్సిందే..!

More Related Stories