శ్రీ రెడ్డి వెనక ఇండస్ట్రీ పెద్దలు 



Shri-Reddy

శ్రీ రెడ్డి.. ఈ పేరే ఓ సంచలనం అయింది... టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కోసం పోరాటం మొదలుపెట్టిన ఈ నటి చేస్తోన్న సంచలన ఆరోపణలు పరిశ్రమ వణికిపోతుందనేది నిజం. మొన్నటికి మొన్న అర్ధనగ్న నిరసనతో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అసలు ఆమెకు సభ్యత్వమే ఇవ్వం అన్నారు. కానీ ఈమె ప్రదర్శనను సీరియస్ గా తీసుకున్న హ్యూమన్ రైట్స్ అసోసియేషన్.. ఇండస్ట్రీ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో ఖంగు తిన్న మా అసోసియేషన్ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి శ్రీ రెడ్డిపై మాకేం కోపం లేదు.. తను ఎవరి సినిమాలో అయిన నటించవచ్చు అన్నారు. అయినా శ్రీ రెడ్డి పోరాటం ఆగలేదు. లేటెస్ట్ గా వాకాడ అప్పారావును ఉద్దేశిస్తూ ఆయనో కామ పిశాచిగా అభివర్ణించింది. పైగా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దని చిరంజీవికీ సూచించింది.
 
ఇక్కడే ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వాకాడ గురించి కామన్ పీపుల్ కు తెలిసింది చాలా తక్కువ. కానీ ఇండస్ట్రీలో అతను, అమ్మాయిలు అనే అంశంపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయనేది నిజం. దీంతో చాలామంది ఇండస్ట్రీ పెద్దలు శ్రీ రెడ్డిని అభినందించారట. అంతేకాదు.. వాకాడ లాంటి వారు మరో పది పదిహేనుమంది వరకూ ఉణ్నారని.. వాళ్ల పేర్లు కూడా ఎలాగోలా బయటకు వస్తే బావుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారని టాక్. మరి ఆ అందరి ‘డేటా’శ్రీ రెడ్డి వద్ద ఉందో లేదో కానీ, ఉంటే మాత్రం ధైర్యంగా బయటపెట్టమని ఈ పెద్దలు శ్రీ రెడ్డికి భరోసా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక ఆ పెద్దలు చెప్పిన పదిహేను మంది పేర్లు బయటకు చెబితే ఇండస్ట్రీయే షేక్ అవుతుందని అందరికీ తెలుసు. కానీ ఎవరో ఒకరు బయటపెడితే.. ఇప్పటికైనా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వదులు(తుందా..?)తుందని ఈ పెద్దలు భావిస్తున్నారట.

 మరోవైపు మరికొంతమంది సినిమా కార్మిక బంధులుగా చెప్పుకునే పెద్దలే శ్రీ రెడ్డి వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారనే ప్రచారమూ ఉంది. మరి వీటిలో నిజమెంతో కానీ.. నిజంగానే ఇండస్ట్రీని దైవంగా భావించే చాలామంది పెద్దలు మాత్రం శ్రీ రెడ్డిని ఇంటర్నల్ గా అయినా అభినందిస్తున్నారు. కాకపోతే తమ పేర్లు బయటకు చెప్పొద్దంటున్నారట. మొత్తంగా చీప్ గా మొదలైన శ్రీ రెడ్డి ప్రయాణం గ్రాండ్ గా ఎండ్ అయ్యే సూచనలున్నాయి. లేకపోతే ప్రపంచంలో ఏ సినిమా పరిశ్రమలో లేని విధంగా ఒక్క టాలీవుడ్ లోనే మహిళా నటుల కోసం ప్రాటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చూస్తారు.. మరి ఇంత పెద్ద ప్రయాణం సినీ పరిశ్రమ పెద్దల అండ లేకుండా శ్రీ రెడ్డి ఒక్కతే చేసిందంటే నమ్మగలమా.. (ఒకవేళ చేసి ఉంటే మాత్రం అభినందనలే)

More Related Stories