English   

ఇరుక్కుపోయిన ప్ర‌భాస్ హీరోయిన్..

Erukupoyina-Prabhas-Heroine

ఈ రోజుల్లో ఎవ‌రికి దొరికినా ఏమో కానీ అభిమానుల‌కు మాత్రం దొర‌క్కూడ‌దు. వాళ్ల‌కు కానీ త‌ప్పు చేసిన‌ట్లు దొరికితే సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటారు. ఇప్పుడు శ్ర‌ద్ధాక‌పూర్ ప‌రిస్థితి కూడా ఇలాగే త‌యారైంది. ఈమె సాహో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే తెలుగు హీరోయిన్ అయిపోయింది శ్ర‌ద్ధా. అందుకే ఈమెపై మ‌న ప్రేక్ష‌కులు కూడా బాగానే శ్ర‌ద్ధ పెట్టారు. ఇకిప్పుడు ఈ భామ అనుకోకుండా ఓ కాంట్ర‌వ‌ర్సీలో ఇరుక్కుంది. ఓవర్ వెయిట్ ఇష్యూలో ఆమె విద్యాబాలన్.. పరిణీతి చోప్రాలకు మద్దతుగా నిలవడంతో నెటిజన్లు శ్ర‌ద్ధాక‌పూర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఈ మ‌ధ్యే అధిక బ‌రువుపై స్పందిస్తూ.. నా బాడీ నా ఇష్టం.. నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా.. నేను చేస్తున్న పని పట్ల సంతృప్తిగానే ఉన్నా.. మీరే మీ మెంటాలిటీ మార్చుకోవాలి.. అని చెప్పింది విద్యాబాలన్. ఆ మ‌ధ్య‌ పరిణీతి మీద కూడా ఇలాంటి విమర్శలే రావడంతో ఆమె బరువు త‌గ్గింది. విద్యాబాలన్ మాదిరిగా అధిక బరువు విమర్శలు ఎదుర్కొంటున్న వారికి సపోర్టు చేస్తూ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేసింది. ప్ర‌పంచమంతా అందాల సుంద‌రిగా భావించే హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోకు ప‌ర్ ఫెక్ట్ ఫిగ‌ర్ లేదు. అధిక బరువుకు.. అందానికి సంబంధం లేదంటూ శ్ర‌ద్ధా క‌మెంట్ చేసింది. దాంతో నెటిజ‌న్ల‌కు కోపం వ‌చ్చింది. అలాంట‌ప్పుడు స‌న్న‌గా మారండి.. గ్రీన్ టీలు తాగండి అంటూ.. ఫ్యాట్ త‌గ్గించుకోండంటూ ఎందుకు యాడ్స్ చేసావంటూ ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కావాల‌ని ఏం చేయ‌క‌పోయినా.. అడ్డంగా దొరికిపోయేస‌రికి ఏ మాట్లాడాలో తెలియ‌క మిన్న‌కుండి పోయింది శ్ర‌ద్ధాక‌పూర్.

More Related Stories