English   

ఫ్యాన్స్ కు కాదు.. నాకు న‌చ్చాలంటున్న నాని..

Fans-Ku-Kaadu-Naaku-Nachalantunna-Nani

నాని అంటే ఇప్పుడు ఉన్న క్రేజే వేరు.. ఈయ‌న పేరు ఇప్పుడు బ్రాండ్ లా మారిపోయింది. వరస విజయాలతో దూసుకుపోతూ స్టార్స్ కు కూడా ద‌డ పెంచేసాడు న్యాచుర‌ల్ స్టార్. ఈ మ‌ధ్య ఈయ‌న చేస్తున్న క‌మెంట్స్ కొన్ని స్టార్ హీరోల‌ను బాధ పెట్టేలా ఉన్నాయంటున్నారు కొంద‌రు. కావాల‌నే కొంద‌రు నానిపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు కూడా చెబుతున్నారు. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో.. అభిమానుల కోసం ఎలాంటి చిత్రాలు చేయాల‌ని మీరు అనుకుంటున్నార‌నే ప్ర‌శ్న‌కు నాకు ఫ్యాన్స్ కాదు ముఖ్యం.. త‌న‌కు న‌చ్చాలి ఎలాంటి సినిమా చేయాలో.. అయినా తాము న‌టించ చేదే అభిమానుల కోసం అయిన‌పుడు మ‌ళ్లీ వాళ్ల‌కు ఎలాంటి సినిమాలు కావాలి అని అడ‌గ‌డం వ్య‌ర్థం అంటున్నాడు నాని. తాను కమల్ హాసన్ అభిమానినని అని చెపుతూ సాగర సంగమం.. స్వాతిముత్యం లాంటి సినిమాలు ఇష్ట‌మ‌న్నాడు నాని. కానీ త‌న‌ను క‌మ‌ల్ వ‌చ్చి ఎప్పుడూ మీకు ఎలాంటి సినిమాలు కావాల‌ని అడ‌గలేద‌ని చెప్పాడు నాని.

త‌ను ఓ క‌థ ఎంపిక చేసుకుంటున్న‌పుడు అభిమానులు క‌చ్చితంగా మైండ్ లో ఉంటార‌ని.. కానీ వాళ్ల‌కు ఏం కావాలో తెలుసుకుని సినిమాలు చేయ‌డం మాత్రం జ‌ర‌గ‌ద‌ని చెప్పాడు నాని. అంతేకాదు తన మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతానని.. స‌త్యం థియేటర్లో కూర్చుని చూస్తూ ఎలా ఫీలవుతాను.. సినిమా అయ్యాక ఎలా ఉందని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెబుతాను అని ఆలోచించుకుని మాత్రమే తాను తన సినిమాలకు ఓకే చెబుతానని అని అంటున్నాడు నాని. త‌న విష‌యంలో ఎవ‌ర్ని త‌ప్పుప‌ట్ట‌డం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని.. సినిమా హిట్టైనా ఫ్లాపైనా త‌న బాధ్య‌తే అంటున్నాడు నాని. ఈయ‌న మాట‌ల్లో కాస్త విశ్వాసంతో పాటు అతివిశ్వాసం కూడా తోడైంద‌ని కొంద‌రు భావిస్తున్నా.. విజ‌యాల్లో ఉన్న‌పుడు ఆ మాత్రం క‌సి క‌నిపిస్తుందిలే అంటూ మ‌రికొంద‌రు లైట్ తీసుకుంటున్నారు.

More Related Stories