English   

కుశుడు కంత్రీలా ఉన్నాడే..!

Finally-Kusa-Teaser-Is-Out

ఇప్ప‌టి వ‌ర‌కు జై ల‌వ‌కుశ‌లో రెండు పాత్ర‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ రెండు టీజ‌ర్ల‌తో హీరోలు ఎలాంటి వాళ్లో చూపించాడు ద‌ర్శ‌కుడు బాబీ. ఇక ఇప్పుడు మూడో పాత్ర టీజ‌ర్ కూడా వ‌చ్చేసింది. కుశ ఎలా ఉంటాడో తెలిసిపోయింది. ఈ టీజ‌ర్ వ‌చ్చిన 14 గంట‌ల్లోనే 20 ల‌క్ష‌ల క్లిక్స్ వ‌చ్చేసాయి. జై రావ‌ణుడు అయితే.. ల‌వ రాముడు అనే క్లారిటీ ఉంది. ఇప్పుడు విడుద‌లైన కుశ మాత్రం క‌చ్చితంగా కంత్రీనే. కృష్ణుడు ప్ల‌స్ మాయ‌గాడు ప్ల‌స్ దొంగ అన్నీ క‌లిపి ఒకే పాత్ర‌లో చూపిస్తున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. పైగా విల‌నీ జై తీసుకుంటే.. మంచిత‌నం ల‌వ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు కామెడీ పార్ట్ మాత్తం కుశ‌కు ఇచ్చేసాడు ద‌ర్శ‌కుడు. దీన్ని ప‌ర్ ఫెక్ట్ గా హ్యాండిల్ చేసేలాగే ఉన్నాడు ఎన్టీఆర్. సెప్టెంబ‌ర్ 21న ఈ ముగ్గురి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి..? అన్నాద‌మ్ములు అయితే ఎలా విడిపోయారు..? ఎందుకు జై విల‌న్ గా మారాడు అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రానుంది.

More Related Stories