English   

ఫిదా పిల్ల‌ను ప‌డుకుంటావా అన్నార‌ట‌..

Gayatri-Gupta-About-Her-Sexual-Harassment

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు వ్యాల్యూ ఉండ‌ద‌ని.. ఇక్క‌డ ఎవ‌రు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాళ్లు ఆడ‌వాళ్ల‌ను ట్రీట్ చేస్తార‌ని.. అవ‌కాశాలు రావాలంటే ఇక్క‌డ ప‌డుకోక త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే చాలా మంది ముద్దుగుమ్మ‌లు చెప్పారు. ఆ మ‌ధ్య‌ త‌న‌ను ఓ హీరో ప‌డ‌క‌గ‌దికి పిలిచాడ‌ని కూడా చెప్పింది డైరెక్ట్ గానే చెప్పింది రాధిక ఆప్టే. ఆ త‌ర్వాత ఓ నిర్మాత‌పై కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఫిదా ఫేమ్ గాయ‌త్రి కూడా ఇదే చెబుతుంది. తనను నేరుగానే పడగ గదికి వచ్చేయమన్నారని చెప్పి బాంబు పేల్చింది ఈ భామ‌. ఫిదా మూవీలో సాయిపల్లవికి ఫ్రెండ్ గా సుమతి పాత్రలో నటించిన గాయత్రి గుప్తా ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్ గానే మాట్లాడింది.

తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. స‌రిగ్గా ఏడాది కింద తాను ఓ సినిమాకు సైన్ చేసాన‌ని చెప్పింది గాయ‌త్రి. ఆ సినిమా ఒప్పుకోక ముందే తాను పడుకోమంటే పడుకోను.. త‌న‌కలాంటివి నచ్చవని చెప్పాన‌ని.. దానికి వాళ్లు ఓకే అన్నార‌ని.. కానీ షూటింగ్ మొదలయ్యాక.. నిదానంగా బలవంతం చేయడం మొదలుపెట్టారని చెప్పింది గాయ‌త్రి. ఒక్క రాత్రికి చాలా డబ్బులు ఇస్తామని చాలామంది ఆఫర్ ఇచ్చార‌ని చెప్పి ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూపించింది గాయ‌త్రి.

అంతేకాదు.. త‌న‌పై ఒక‌రోజు రేప్ అటెంప్ట్ కూడా జ‌రిగింద‌ని చెప్పి బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఒక‌రోజు కారులో తీసుకెళుతూ కారును బ్రేక్ డౌన్ చేసి.. ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అని చెప్పి.. అక్కడకు తీసుకెళ్ళి డ్రస్సు లాగేస్తూ రేప్ చేయబోయారు.. చివరకు తప్పించుకుని వచ్చేసాన‌ని చెప్పింది గాయ‌త్రి. ఇక తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ తనకు అయిదు బ్రేకప్ లు అయ్యాయని చెప్పింది. చివరి బ్రేకప్ దర్శకుడు ప్రణీత్ తో జరిగిందని పేర్కొంది. ఈ బ్రేకప్ తనను ఎంతో బాధించిందని అంటూ తాను సీరియస్ గా ప్రేమించి మోసపోయానని తెలిపింది.. సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ పరిస్థితి చూసిన తర్వాత త‌న‌కు అసలు సినిమాల్లో నటించాలనే అనిపించట్లేదని తెలిపింది. మొత్తానికి ఇండ‌స్ట్రీ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ మాత్రం కామ‌న్ అయిపోయిందిప్పుడు.

More Related Stories