English   

 పండ‌క్కి ముందు ప‌ని చేస్తున్నారు..

alluarjun-prabhas

మొన్న‌టి వ‌ర‌కు అంతా న్యూ ఇయ‌ర్ సంబ‌రాల్లో ఉన్నారు. సెల‌వులు తీసుకున్నారు. దాంతో షూటింగ్స్ కు అనుకోని బ్రేకులు ప‌డ్డాయి. దాంతో ఇప్పుడు హీరోలంతా ప‌నుల‌తో బిజీ అయిపోయారు. పండ‌క్కి అంతా సెల‌వులు తీసుకుంటే హీరోలు మాత్రం ప‌ని చేస్తున్నారు. స్టార్ హీరోలంతా ఇప్పుడు హైద‌రాబాద్ లోనే ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌కు విదేశాల్లో ఉన్న మ‌హేశ్ ఇప్పుడు సిటీకి వ‌చ్చాడు. ఇక్క‌డే శంక‌ర్ ప‌ల్లిలో సిఎం గారిపై కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు కొర‌టాల శివ‌. ఈయ‌న తెర‌కెక్కిస్తోన్న భ‌ర‌త్ అనే నేను షూటింగ్ ఇక్క‌డే జ‌రుగుతుంది. ఇక నాగార్జున కూడా సిటీలోనే ఉన్నాడు. ఈయ‌న మొన్న‌టి వ‌ర‌కు అఖిల్ సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు వ‌ర్మ కోసం మ‌ళ్లీ ప‌ని మొద‌లుపెట్టాడు. గ‌చ్చిబౌలిలో నాగార్జున‌పై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. మ‌రికొన్ని రోజుల పాటు నాన్ స్టాప్ గా ఇక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. 

ఈయ‌న‌కు తోడు అల్లుఅర్జున్ సైతం సిటీలోనే ఉన్నాడు. ఈ మ‌ధ్యే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌చ్చిన నా పేరు సూర్య టీం.. ఇప్పుడు సిటీలో ఉన్నారు. బ‌న్నీ, అను ఎమ్మాన్యువ‌ల్ తో పాటు కొంద‌రు న‌టుల‌పై ఫ్యామిలీ సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ. ఇక లాస్ట్ బ‌ట్ నాట్ ది లీస్ట్.. ప్రభాస్ కూడా సిటీలోనే ప‌ని మొద‌లు పెట్టాడు. ఈయ‌న సాహో దుబాయ్ షెడ్యూల్ కు వెళ్లాల్సి ఉన్నా.. అక్క‌డ  అనుమ‌తి రాక‌పోవ‌డంతో సిటీలోనే ప‌ని కానిస్తున్నాడు. కొత్త షెడ్యూల్ ఇక్క‌డే జ‌ర‌గ‌నుంది. జ‌న‌వ‌రి చివ‌ర్లో దుబాయ్ వెళ్ల‌నున్నారు చిత్ర‌యూనిట్. మొత్తానికి స్టార్ హీరోలంతా ఇక్క‌డే పండ‌గ చేసుకుంటున్నారు.

More Related Stories