English   

నేను బాగానే ఉన్నానంటున్న ఎస్పీబీ.. 

I-Am-Healthy-And-Fine-Says-SP-Balasubrahmanyam

ఈ మ‌ధ్య కాలంలో సినిమా ఇండ‌స్ట్రీ టైమ్ అస‌లే బాలేదు. ఎక్క‌డ ఏ చేదువార్త వినాల్సి వ‌స్తుందేమో అని వణికిపోతున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఈ టైమ్ లో ఎవ‌రైనా ఆరోగ్యం బాలేదంటూ చిన్న‌గా హాస్పిట‌ల్ మెట్లెక్కితే చాలు.. ఏదో అయిపోయిందంటూ వార్త‌లు పుట్టిస్తున్నారు. ఇప్పుడు మ‌ధుర గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఎవ‌రో త‌న ఆరోగ్యం బాగోలేద‌ని.. అందుకే ఒప్పుకున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా ర‌ద్దు చేసుకుంటున్నాన‌ని వదంతులు సృష్టించార‌ని చెప్పాడు ఎస్పీబీ. తన ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషుల నుంచి పరామర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే ఫేస్ బుక్ లో తాను ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు పోస్ట్ చేసారు బాలు.

దగ్గు, జలుబుతో డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లినా కూడా త‌న‌కు ఏదో అయిపోయింద‌నే భ్ర‌మ ప‌డుతున్నార‌ని.. అదేం కాద‌ని చెప్పాడు ఈయ‌న‌. ఇక త‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు ర‌ద్దు చేసుకోడానికి కార‌ణం మాత్రం త‌న‌ సోదరి గిరిజ కన్నుమూయడమే అని చెప్పుకొచ్చారు బాలు. ఆ కుటుంబంతోనే దాదాపు 12 రోజులు ఉండాల్సి రావ‌డంతో త‌ను ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌లేద‌న్నారు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. అనవసరంగా ఇలాంటి వదంతులను సృష్టించి.. ఎందుకు బాధ క‌లిగిస్తున్నారో అర్థం కాదు.. తాను హాయిగా ఆర్ఎఫ్ సీలోనే స్వరాభిషేకం లో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో తెలిపారు బాలు.

More Related Stories