English   

అల్లు బాట‌లో ఇండ‌స్ట్రీ.. 

మిస్ట‌ర్ ఆడియో వేడుక కూడా చివ‌ర్లో క్యాన్సిల్ అయింది. మెగా దారిని కాద‌ని మిస్ట‌ర్ పాత దారిలోనే వెళ్తున్నాడ‌ని అనుకునే లోపే మ‌న‌సు మార్చుకుని మ‌ళ్లీ కొత్త ట్రెండ్ లోకి వ‌చ్చాడు వ‌రుణ్ తేజ్. ఒక‌ప్పుడు అయితే పాట‌లు నేరుగా విడుద‌ల అవుతున్నాయంటే షాక్ అయ్యేవాళ్లు. కానీ ఈ మ‌ధ్య అదే ట్రెండ్ అయిపోయింది. అస‌లు స్టార్ హీరోల సినిమాలు ఆడియో వేడుక‌లు లేకుండా డైరెక్ట్ గా పాట‌లు మార్కెట్ లోకి రావ‌డం చాలా అరుదు. ఎందుకంటే సినిమా విడుద‌ల‌కు ముందు తాము ప‌డ్డ క‌ష్టాన్ని అభిమానుల‌తో పంచుకోడానికి.. సినిమా ప్ర‌మోష‌న్ పెంచుకోడానికి వార‌ధి ఆడియో వేడుక‌. ఇప్పుడు ఆ ఆడియో వేడుక‌లే మాయ‌మైపోతున్నాయి. ఇన్నాళ్లూ ఆడియో ఫంక్ష‌న్ ను గ్రాండ్ గా చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఆడియో వేడుక‌ల వైపే క‌న్నేయ‌ట్లేదు. 

మెగా నిర్మాత అల్లు అర‌వింద్ పుణ్య‌మా అని ఇప్పుడంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ ల‌పై ప‌డ్డారు. త‌న స‌రైనోడు, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, ధృవ‌, ఖైదీ నెం. 150, సినిమాల‌కు ఆడియో వేడుక‌లు చేయ‌లేదు అల్లు అర‌వింద్. పాట‌ల్ని నేరుగా మార్కెట్ లోకి విడుద‌ల చేసి.. విడుద‌ల‌కు వారం ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేసాడు. ఇప్పుడు ఇదే దారిలో మిగిలిన హీరోలు కూడా వెళ్తున్నారు. సాయిధ‌రంతేజ్ విన్న‌ర్ పాట‌లు నేరుగా విడుద‌ల చేసి.. ప్రీ రిలీజ్ వేడుక చేసారు. ఇక రాజ్ త‌రుణ్ కూడా కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త పాట‌ల్ని నేరుగా విడుద‌ల చేసారు. కాట‌మ‌రాయుడు పాట‌లు సైతం నేరుగా మార్కెట్ లోకి వ‌చ్చేసాయి. ఇప్పుడు మార్చ్ 30న జేఆర్సీ క‌న్వెన్ష‌న్ లో ఆడియో జ‌రుగుతుంద‌ని అనౌన్స్ చేసిన త‌ర్వాత మ‌ళ్లీ మిస్ట‌ర్ టీం వెన‌క్కి త‌గ్గారు. అల్లు వారి బాట‌లో వెళ్తూ.. ఎప్రిల్ 6న  ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. ఇక రేపు మ‌హేశ్ బాబు కూడా మురుగ‌దాస్ సినిమాతో ఇదే దారిలో వెళ్తే.. ఇక మ‌న హీరోలు ఆడియో ఫంక్ష‌న్ ల‌కు దాదాపు దూర‌మైన‌ట్లే అని క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చు.

More Related Stories