English   

ప‌వ‌న్ ను వాడేసుకుంటున్న క‌ళ్యాణ్

Kalyanram-naanuvve

అవును.. ప‌వ‌న్ ను క‌ళ్యాణ్ వాడుకుంటున్నాడు. అదేంటి అనుకుంటున్నారా..? అదంతే.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ అయ్యాడు. ఆయ‌న్ని ఎవ‌రైనా వాడేసుకోవ‌చ్చు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. మెగా హీరోను నంద‌మూరి హీరో వాడేసుకుంటున్నాడు. అత‌డే క‌ళ్యాణ్ రామ్. జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టిస్తోన్న సినిమా టీజ‌ర్ ఇప్పుడు అజ్ఞాత‌వాసి సినిమాతో క‌లిసి విడుద‌ల కానుంది. అయితే ఇక్క‌డ కాదు.. యుఎస్ లో మాత్ర‌మే అజ్ఞాత‌వాసి థియేట‌ర్స్ లో క‌ళ్యాణ్ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్తి అయిపోయింది. త‌మ‌న్నా హీరోయిన్. ఈ చిత్రానికి పిసి శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌టం విశేషం. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌ళ్యాణ్ రామ్ వాడేస్తున్నాడ‌న్న‌మాట‌. 

More Related Stories