English   

ర‌వితేజ సినిమా అడ్డుకున్న నాగార్జున‌..

Is-Nagarjuna-Troubling-Ravi-Teja

అదేంటి.. ర‌వితేజ సినిమాను నాగార్జున అడ్డుకోవ‌డం ఏంటి అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. కావాలని నాగ్ ఈ ప‌ని చేయ‌లేదు. కానీ నిజంగానే ర‌వితేజ కొత్త సినిమాను అడ్డుకున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. అస‌లు క‌థ ఏంటంటే.. క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ఈ మ‌ధ్యే ర‌వితేజ‌కు ఓక‌థ చెప్పి ఒప్పించాడు.. అన్న‌పూర్ణ స్టూడియోస్ లోనే ఈ చిత్రానికి డిసెంబ‌ర్ 5న ముహూర్తం పెట్టాల‌నుకున్నాడు కానీ నాగ్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో మూడు సినిమాల ఒప్పందం కాద‌నుకుని.. మూడో సినిమాను బ‌య‌టి హీరోతో చేస్తుండ‌టం నాగార్జున‌కు ససేమిరా న‌చ్చ‌లేదు.

ఈ రోజుల్లో ఒక్క హిట్ కొట్ట‌డానికే నానా తంటాలు ప‌డుతున్నారు ద‌ర్శ‌కులు. అలాంటిది కొత్త ద‌ర్శ‌కుడు.. అది కూడా మాస్ ఇమేజ్ లేని అక్కినేని హీరోల‌తో సినిమాలు చేసి 50 కోట్లు వ‌సూలు చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. కానీ క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల అది చేసి చూపించాడు. ఈయ‌న తెర‌కెక్కించిన సోగ్గాడే చిన్నినాయ‌నా.. రారండోయ్ వేడుక చూద్దాం సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ విధంగా ద్వితీయ విఘ్నాన్ని ఘ‌నంగా దాటేసి.. క్రేజీ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లోకి అడుగు పెట్టాడు క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌. మూడో సినిమాను కూడా నాగార్జున హీరోగా బంగార్రాజు చేయాల‌నుకున్నాడు క‌ళ్యాణ్ కృష్ణ‌. కానీ అనుకోని కార‌ణాల‌తో ర‌వితేజ‌తో మ‌రో సినిమా చేయాల్సి వ‌చ్చింది. కానీ ఇప్పుడు దానికి నాగ్ ఒప్పుకోవ‌ట్లేదని స‌మాచారం. మొత్తానికి అలా ర‌వితేజ సినిమాను నాగార్జున అడ్డుకుంటున్నాడు.

More Related Stories