English   

ప్రేమ‌లో ప‌డిన వ‌రుణ్ తేజ్..

Is-Varun-Tej-In-Love

అవును.. నిజంగానే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ప్రేమ‌లో ప‌డ్డాడు. అస‌లే సిక్స్ ఫీట్ క‌టౌట్ క‌దా.. క‌చ్చితంగా ఎవ‌రో అమ్మాయి ప‌డిపోయే ఉంటుందిలెండి అనుకుంటున్నారా..? మ‌రి ఈ కుర్రాన్ని ప్రేమ‌లో దించేసింది అమ్మాయి కాదు.. ఓ సినిమా.. అదేంటో తెలుసా ఫిదా. ఈ సినిమా చేసిన‌ప్ప‌ట్నుంచీ అలాంటి క‌థ‌ల‌కు ఫ్యాన్ అయిపోయాడు వ‌రుణ్. అందుకే వ‌ర‌స‌గా ప్రేమ‌క‌థ‌ల‌కే ఓకే చెబుతున్నాడు. దానికిముందు లోఫ‌ర్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల వైపు వెళ్లి దెబ్బ‌తిన్నాడు వ‌రుణ్. అలాంటి టైమ్ లో వ‌చ్చిన ఫిదా ఈ కుర్రాడికి ఏజ్ ను గుర్తు చేసింది. దాంతో త‌న ఇమేజ్ ప్రేమ‌క‌థ‌ల వైపు మ‌ళ్లిస్తే బెట‌ర్ అని వ‌ర‌స‌గా అవే చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే నానితో నిన్నుకోరి లాంటి సెన్సిబుల్ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన శివ‌నిర్వాణ‌.. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడు. నిన్నుకోరిలో మ‌న‌సును హ‌త్తుకునే భావోద్వేగాలు ప‌లికించిన శివ‌.. వ‌రుణ్ తేజ్ కోసం అలాంటి క‌థనే వండే ప‌నిలో బిజీగా ఉన్నాడు. తొలి సినిమాతోనే ఎంతో కాంప్లికేటెడ్ క‌థ‌ను ఎంచుకున్నాడు. త‌ను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కావ‌డం.. అయినా ప‌ర్లేద‌ని త‌న ప్రేమ‌ను గెలిపించుకోడానికి ఆ పెళ్లైన అమ్మాయి ఇంటికి హీరో వెళ్ల‌డం అనేది చాలా భిన్న‌మైన క‌థ‌.

ఇది తెలుగు వాళ్లు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేని నేప‌థ్యం. కానీ ఇదే క‌థ‌ను ఎంతో హృద్యంగా.. అందంగా మ‌న‌సుకు హ‌త్తుకునేలా చెప్పాడు శివ‌నిర్వాణ‌. ఈ చిత్రం త‌ర్వాత కుర్రాడికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ ద‌ర్శ‌కుడి రెండో సినిమా ఏంటా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వ‌చ్చింది. వ‌రుణ్ తేజ్ కోసం ఈ ద‌ర్శ‌కుడు ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ క‌థ వ‌రుణ్ కు చెప్ప‌డం.. అక్క‌డ్నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేయ‌డం కూడా జ‌రిగిపోయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎలాగూ వ‌రుణ్ తో దిల్ రాజు ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇదే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. నిన్నుకోరి త‌ర‌హాలోనే ఇది కూడా పూర్తిగా హృద‌యాన్ని హ‌త్తుకునే ప్రేమ‌క‌థ అని తెలుస్తోంది. మొత్తానికి శివ రెండో సినిమాతో ఎలాంటి మాయ చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories