English   

జై ల‌వ‌కుశ ట్రైల‌ర్.. అంతా రావ‌ణుడే..!

Jai-Lava-Kusa-Trailer-Out

ఆ రావ‌ణుడు ఎలా ఉంటాడో అప్ప‌ట్లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించింది ఒక్క ఎన్టీఆర్ మాత్ర‌మే. ఇప్పుడు ఆ రూపాన్ని మ‌ళ్లీ చూపిస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. జై ల‌వ‌కుశ‌లో అభిన‌వ రావ‌ణుడిగా న‌టిస్తున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత మ‌రోసారి తాను ఎంత పెద్ద న‌టున్ని అనే విష‌యాన్ని చూపించాడు ఎన్టీఆర్. మూడు పాత్ర‌లు చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ మూడింటిని ప‌ర్ ఫెక్ట్ గా చేసి ఔరా అనిపించాడు యంగ్ టైగ‌ర్. ల‌వ‌, కుశ పాత్ర‌ల కంటే అంద‌రి నోళ్లలోనూ నానుతున్న పాత్ర జై. రావ‌ణుడిగా ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసాడు ఈ హీరో. ముఖ్యంగా డైలాగుల ద‌గ్గ‌ర అయితే తాత‌గారిని గుర్తు చేసాడు. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత కూడా జై పాత్ర‌కు వ‌చ్చే రెస్పాన్స్ ఊహించుకుంటుంటేనే రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం ప‌క్కా. చూడాలిక‌.. సెప్టెంబ‌ర్ 21న ఈ ముగ్గురు ఎన్టీఆర్ లు ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నారో..?

More Related Stories