English   

జై ల‌వ‌కుశ.. యుద్ధం ఆగ‌డం లేదు..

Jai-Lava-Kusa-Yuddham-Agadam-Ledu

వ‌సూళ్ల ప‌రంగా కుమ్మేస్తున్నాడు ఎన్టీఆర్. తొలిరోజు ఖైదీ నెం.150కి కొట్ట‌లేక‌పోయినా కూడా నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ చిత్రం ఇప్ప‌టికే 30 కోట్ల షేర్ తొలిరోజు వ‌సూలు చేసింది. ఇక రెండో రోజు కూడా జై ల‌వ‌కుశ జోరు త‌గ్గ‌లేదు. చాలా చోట్ల సినిమా హౌజ్ ఫుల్స్ తో ర‌న్ అవుతుంది. తొలిరోజు 2400 స్క్రీన్స్ లో విడుద‌లైన జై ల‌వ‌కుశ‌.. ఆ త‌ర్వాత త‌గ్గింది. ఇప్ప‌టి వ‌ర‌కు వినిపిస్తోన్న లెక్క‌ల ప్ర‌కారం రెండో రోజు ఈ చిత్రం ఓవ‌రాల్ గా 9 కోట్ల‌కు పైగా షేర్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. రెండో రోజు ఇంత మూవెంట్ మెయింటేన్ చేయ‌డం విశేషమే. మ‌రో నాలుగు రోజుల్లో స్పైడ‌ర్ వ‌స్తోన్న సంద‌ర్భంలో క‌చ్చితంగా జై ల‌వ‌కుశ ఇప్పుడే వ‌సూళ్లు వీలైన‌న్ని రాబ‌ట్టాలి. లేదంటే ఆ త‌ర్వాత మ‌హేశ్ వ‌స్తాడు.. థియేట‌ర్స్ తీసుకుంటాడు. అప్పుడు క‌లెక్ష‌న్లు రావాల‌న్నా ఊహించ‌న‌న్ని రావు. ఫ‌స్ట్ వీక్ లోనే 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేస్తే కానీ జై ల‌వ‌కుశ‌కు సేఫ్ అయ్యే అవ‌కాశాలు ఉండ‌వు. మ‌రి చూడాలిక‌.. ఈ వీకెండ్ లో కూడా జై ల‌వ‌కుశ ఇదే స్థాయిలో కుమ్మేస్తాడేమో..?

More Related Stories