English   

జ‌న‌సేన‌.. రివేంజ్ ఫార్ములా అదిరిందిగా..

Janasena-Pawan-Kalyan-s-Revenge-Formula

జ‌న‌సేన ఏంటి.. రివేంజ్ ఫార్ములా ఏంటి అనుకుంటున్నారా..? అవును మ‌రి.. సినిమాల్లో ప్ర‌తీకారం ఉన్న‌ట్లే బ‌య‌ట కూడా ఉంటుంది. ప‌వ‌ర్ స్టార్ ఈ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించాడు. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల‌తో పాటు పిఆర్పీకి జ‌రిగిన అన్యాయాన్ని కూడా బాగానే గుర్తు పెట్టుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. వైజాగ్ స‌భ‌లో ప‌వ‌న్ మాట‌లు వింటే చిరంజీవి అంటే త‌న‌కు ఎంత గౌర‌వ‌మో.. ప‌వ‌న్ గుండెల్లో చిరు స్థాన‌మేంటో అర్థ‌మైపోతుంది. ఇప్ప‌టికీ అన్న‌య్య‌ను దేవుడిగా పూజిస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఎప్పుడూ ఏదో అంత‌రం ఉన్న‌ట్లే క‌నిపిస్తుంది. కానీ లోప‌ల వాళ్లు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరి కోసం ఒక‌రు అన్న‌ట్లు క‌నిపిస్తుంటారు. కాక‌పోతే బ‌య‌ట ఎక్కువ‌గా క‌ల‌వ‌క‌పోవ‌డంతో అన్నాత‌మ్ముళ్ల మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తుంటాయి.

తాను ఎంత ఎదిగినా అన్న‌య్య‌ను మాత్రం ఇప్ప‌టికీ గుండెల్లోనే దాచుకున్నాడు ప‌వ‌న్. అన్న‌య్య షూ సాక్సుల వాస‌న త‌న‌కు సుగంధంలా అనిపించేదని ఆ మ‌ధ్య స‌ర్దార్ ఆడియోలో చెప్పుకొచ్చాడు ప‌వ‌ర్ స్టార్. ఇక ఇప్పుడు మ‌రోసారి అన్న‌ గురించి చెప్పాడు ఈ త‌మ్ముడు. వైజాగ్ కి వెళ్లిన ఈ జ‌న‌సేనాని అక్క‌డ జ‌నం మ‌ధ్య ఆవేశంగా మాట్లాడాడు. పిఆర్పీ గురించి మ‌రోసారి త‌న మ‌న‌సులో ఉన్న ఆవేద‌న‌ను బ‌య‌టికి వెళ్ల‌గ‌క్కాడు ప‌వ‌ర్ స్టార్.

ఒక‌ప్పుడు చిరంజీవి గారిని ఎవ‌రెవ‌రు ఎలా మోసం చేసారు.. స‌మాజానికి మంచి చేయాల‌నే స‌దుద్దేశంతో వ‌చ్చిన ఓ మంచి వ్య‌క్తిని ఎవ‌రు ద్రోహం చేసారో.. ఎవ‌రెవ‌రు వెన్నుపోటు పొడిచారో అన్నీ త‌న‌కు తెలుస‌న్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అవేవీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను మరిచిపోలేద‌ని చెప్పాడు ప‌వ‌న్. ప్ర‌జారాజ్యం పార్టీ ఓడిపోయింద‌నే బాధ కంటే.. మార్పు తేవాల‌ని ప్ర‌య‌త్నించిన చిరంజీవి లాంటి మంచి వ్య‌క్తిని కొన్ని కీట‌కాలు వ‌చ్చి నాశ‌నం చేసి వేడుక చూసార‌న్నాడు ప‌వ‌ర్ స్టార్. వాళ్లెవ‌ర్నీ త‌ను మ‌రిచిపోలేద‌ని.. అంద‌రి జాత‌కాలు బ‌య‌ట‌పెడ‌తాన‌న్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అప్పుడు ప్ర‌జారాజ్యం పార్టీని దెబ్బ‌తీసిన వాళ్ల‌ను ఇప్పుడు జ‌న‌సేన నిల‌దీస్తుంద‌ని.. ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగానే ఇప్పుడు జ‌న‌సేన వ‌చ్చింద‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

రాజ‌కీయాల ప‌రంగా ఇద్ద‌రూ భిన్న‌దృవాలైనా.. క‌టుంబ ప‌రంగా ఇప్పటికీ ఎప్ప‌టికీ మెగా బ్ర‌ద‌ర్స్ ఒకే దారిలో న‌డుస్తుంటారు. ఈ రోజుకు కూడా అన్న‌య్య చిరంజీవి అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చెప్ప‌లేనంత అభిమానం.. గౌర‌వం.. ప్రేమ‌. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీసారి త‌న‌కు అన్న‌య్య అంటే ఎంత ఇష్ట‌మో చెబుతూనే ఉన్నాడు ప‌వ‌ర్ స్టార్. ఇక ఇప్పుడు వైజాగ్ స‌భ‌లో కూడా అన్నపై త‌న‌ ప్రేమ‌ను చూపించాడు ప‌వ‌ర్ స్టార్. ఇప్ప‌టికీ ప‌వ‌న్ దృష్టిలో చిరంజీవి ఉన్న‌త‌మైన వ్య‌క్తి. స‌మాజాన్ని మార్చేయాల‌ని వ‌చ్చిన శ‌క్తి.. అత‌న్ని పాడుచేసిన వాళ్లు ఉన్నారు కానీ అన్న‌య్య మాత్రం ఓ మంచి వ్య‌క్తి అంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి త‌న‌కు తెలిసిన హీరో చిరంజీవి ఒక్క‌డే అని చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. ఈ మాట విన‌డానికి చాలా చిన్న‌గా ఉంది కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి సూప‌ర్ స్టార్ ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ కోట్లాది ప్రేక్ష‌కుల సాక్షిగా అన్న‌య్యే త‌న హీరో అని గ‌ర్వంగా చెప్పుకున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మొత్తానికి ప‌వ‌న్ మాట‌తీరు చూస్తుంటే ఫ్యూచ‌ర్ లో త‌న పార్టీలోకి అన్న‌య్య‌ను తీసుకొస్తాడేమో అనిపిస్తుంది. కానీ ఎప్ప‌టికీ త‌న అన్న‌య్య దారిలోకి తాను వెళ్ల‌న‌ని మొన్నే చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. చూడాలిక‌.. ఈ మెగా బ్ర‌ద‌ర్స్ ను కాలం ఎలా డిసైడ్ చేస్తుందో..?

More Related Stories