English   

అజ్ఞాత‌వాసి ఆయ‌న‌కు న‌చ్చింది.. 

Agnyaathavaasi-news

అజ్ఞాత‌వాసి సినిమాపై ఇప్పుడు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. ప‌వ‌న్ లాంటి సూప‌ర్ స్టార్ ఉండ‌గా కూడా త్రివిక్ర‌మ్ ఏం మాయ చేయ‌లేక‌పోయాడ‌ని తొలిసారి త‌న కెరీర్ లో ఓ ఫ్లాప్ సినిమా తీసాడ‌ని మాటల మాంత్రికుడిని తిట్టుకుంటున్నారు ఫ్యాన్స్. ప్ర‌స్తుతం ఓపెనింగ్స్ ప‌రంగా దుమ్ము దులిపే స్తున్నా కూడా ఎంత‌వ‌ర‌కు అజ్ఞాత‌వాసి నిల‌బ‌డ‌తాడ‌నేది మాత్రం ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇలాంటి స‌మ‌యంలో అజ్ఞాత‌వాసి క‌థ ఎక్క‌డ్నుంచైతే వ‌చ్చిందో.. ఆ ద‌ర్శ‌కుడు స్పందించాడు. ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు రీమేక్. ఇప్పుడు ఈయ‌నే సీన్ లోకి వ‌చ్చాడు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు జెరోమ్‌సలే త‌న సినిమాకు అజ్ఞాత‌వాసి కాపీ అని తేల్చేసాడు. అజ్ఞాతవాసిని విడుద‌ల రోజే అమెరికాలో చూసిన ఆయన.. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. లీబ్రాడేలో అజ్ఞాతవాసి సినిమా చూసాన‌ని.. సినిమా తనకు బాగా నచ్చిందని.. దురదృష్టం కొద్దీ లార్గోవించ్‌కి చాలా దగ్గరగా ఉందన్నాడు. క‌థ త‌న సినిమాకు చాలా ద‌గ్గ‌రగా ఉంద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ టేకింగ్ ప‌రంగా సినిమా త‌న‌కు బాగా న‌చ్చింద‌ని జేరోమ్ చెప్పడం ఆస‌క్తిక‌రం. 

More Related Stories