English   

ఎన్టీఆర్ ప‌క్కా ప్లాన్ తోనే వెళ్లాడు..

Jr-NTR-Is-Enjoying-A-Foreign-Trip-With-Family

స్టార్ హీరోల‌కు బ్రేక్ దొరికేదే త‌క్కువ‌. అలా దొరికిన‌పుడే వాళ్లు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నాడు. గ‌త ఏడాదిగా ఈయ‌న చాలా బిజీగా ఉన్నాడు. మొన్న విడుద‌లైన జై ల‌వ‌కుశ కంటే ముందు కూడా ఎన్టీఆర్ బిజీ బిజీ. బిగ్ బాస్ షోతో పాటు జైల‌వ‌కుశ  సినిమా గురించి గ్యాప్ లేకుండా ప‌ది నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డ్డాడు యంగ్ టైగ‌ర్. అందుకే ఫుల్లుగా అలిసిపోయాడు జూనియ‌ర్. ఆ మ‌ధ్య త‌ను రెస్ట్ తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు ఎన్టీఆర్. ఇప్పుడు చెప్పిన‌ట్లుగానే హాలీడే సెట్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో యూర‌ప్ వెళ్లిపోయాడు ఈ హీరో. ఈ ట్రిప్ ఎప్పుడో ప్లాన్ చేసినా కూడా ఎన్టీఆర్ త‌న‌యుడు అభిరామ్ విసా ప్రాబ్ల‌మ్స్ తో దాదాపు నెల రోజుల పాటు ఆల‌స్య‌మైంది. ఇప్పుడు యూర‌ప్ కి వెళ్లాడు ఎన్టీఆర్.

15 రోజులు అక్క‌డే ఉండ‌బోతున్నాడు ఎన్టీఆర్. డిసెంబ‌ర్ నెలాఖ‌ర్లో ఇండియా రానున్నాడు జూనియ‌ర్. ఇక్క‌డే న్యూ ఇయ‌ర్ సెలెబ్రేష‌న్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. వ‌చ్చిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో ఇది మొద‌లు కానుంది. అందుకే ఫారెన్ లోనే త్రివిక్ర‌మ్ సినిమా లుక్ కూడా ఫైన‌ల్ చేసుకోనున్నాడు. అక్క‌డ్నుంచి వ‌చ్చిన త‌ర్వాత మ‌రో ఏడాదిన్న‌ర పాటు బ్రేక్ లేకుండా ప‌ని చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్. సెప్టెంబ‌ర్ నుంచి రాజ‌మౌళి సినిమా కూడా రెడీగా ఉంది. దాంతో త‌న‌కు దొరికిన ఈ కాస్త టైమ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. మొత్తానికి యూర‌ప్ వెళ్లి.. ఏడాది ఎంజాయ్ మెంట్ మొత్తం ఒకేసారి చేయ‌బోతున్నాడు యంగ్ టైగ‌ర్.

More Related Stories