English   

క‌త్రినా కైఫ్.. సొగ‌సుల నైఫ్..

Katrina-Kaif-s-Hot-Avatar-Goes-Viral

పేరులోనే క‌త్తి ఉంది.. కైపు ఉంది.. ఇక ఎందుకు ఊరికే ఉంటుంది చెప్పండి. అందుకే పేరుకు త‌గ్గ‌ట్లుగానే క‌త్తి లాంటి కైపుల‌తో చూపులు తిప్పుకోని అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది క‌త్రినా కైఫ్. మొన్న‌టి వ‌ర‌కు ఉనికి కాపాడుకోడానికి అందాలు అడ్డు పెట్టిన క‌త్రినా ఇప్పుడు మాత్రం నెంబ‌ర్ వ‌న్ పీఠం కోసం పోరాడుతుంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ఇదిగో ఇలా హాట్ ఫోటోషూట్ ల‌తో ప్రేక్ష‌కుల గుండెలు గ‌ల్లంతు చేస్తోంది క‌త్రినా. మొహమాటం అనే ప‌దం క‌త్రినా డిక్ష‌న‌రీలోనే లేదు. అందాల ఆర‌బోత‌లో ఈ భామ పిహెచ్ డీ పూర్తిచేసింది ఈ భామ‌. ఎంత కావాలంటే అంత‌.. రెడీ అంటూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్నటికి మొన్న బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన క్యాట్స్.. ఇంకో హాట్ షోతో మ‌తులు పోగొడుతుంది.

కొత్త హీరోయిన్ల ధాటికి.. దీపిక జోరుకు ఎప్పుడో క‌త్రినా సైలెంట్ అయిపోయింది. కానీ ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఏ దేవుడో క‌రుణించిన‌ట్లున్నాడు. అందుకే క‌త్రినాకు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ భామ స‌ల్మాన్ కు జోడీగా టైగ‌ర్ జిందా హైలో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని సుల్తాన్ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇక ఖాన్ అనే సినిమాలోనూ స‌ల్మాన్ తో జోడీక‌ట్ట‌బోతుంది క‌త్రినా. ర‌ణ్ వీర్ సింగ్-క‌బీర్ ఖాన్ కాంబినేష‌న్లో రాబోయే క‌పిల్ దేవ్ బ‌యోపిక్ లో న‌టిస్తుంది క‌త్రినా. వీటికి తోడు ప్ర‌స్తుతం అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో కూడా క‌త్రినా హీరోయిన్ గా న‌టిస్తుంది. ధూమ్ 3లో గ‌తంలో వీళ్లు క‌లిసి న‌టించారు. ఇలా ఒకేసారి అర‌డ‌జ‌న్ సినిమాలు ఈ భామ చెంత చేరాయి. మొత్తానికి లేట్ ఏజ్ లో ఘాటు చూపిస్తుంది క‌త్రినా కైఫ్. మ‌రోవైపు అందాల‌తోనూ ర‌చ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories