English   

కీర్తి బాగా పెరిగిపోతుంది బాబోయ్..!

Keerthy-Suresh

ఆమె పేరులోనే కీర్తి ఉంది. ఇక కెరీర్ లో మాత్రం ఎందుకు ఉండ‌దు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. కీర్తిసురేష్ ఇమేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ భామ కోసం స్టార్ హీరోలంతా క్యూ క‌డుతున్నారు. అమ్మ‌డి అదృష్టం ఏంటో కానీ ఇప్పుడు చేస్తోన్న సినిమాల‌న్నింటిలోనూ స్టార్ హీరోల‌తోనే జోడీ క‌ట్టింది ముద్దుగుమ్మ‌. 2018 మొత్తాన్ని కీర్తిసురేష్ ద‌త్త‌త తీసుకుంది. ఈ ఏడాదిలో ఏ సినిమాలో చూసినా మ‌న‌కు కీర్తి బొమ్మే క‌నిపించ‌బోతుంది. సంక్రాంతి నుంచే అమ్మాయిగారి సంద‌డి మొద‌లు కానుంది. జ‌న‌వ‌రి 10న అజ్ఞాత‌వాసి విడుద‌ల కానుంది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ న‌టించింది. ఇక జ‌న‌వ‌రి 12న సూర్య గ్యాంగ్ విడుద‌ల కానుంది. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కుడు. ఇందులో పేరు లేని పాత్ర‌లో న‌టించింది కీర్తి. అర్జున్ లో మ‌హేశ్ బాబులా ఇందులో కీర్తిసురేష్ పాత్ర‌కు పేరుండ‌దు. ఈ సంక్రాంతికి ఇటు తెలుగు.. అటు త‌మిళ ఇండ‌స్ట్రీల్లో విడుద‌ల కాబోయే పెద్ద సినిమాల్లో కీర్తినే హీరోయిన్. 

ఇక మ‌హాన‌టి సినిమాలోనూ ఈమె హీరోయిన్. ఇది బై లింగువ‌ల్ ప్రాజెక్ట్.. ఈ చిత్రం మార్చ్ 29న విడుద‌ల కానుంది. సావిత్రి జీవితం అన‌గానే అంద‌రికీ కొన్ని అంచ‌నాలుంటాయి. వాటికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇక కీర్తిసురేష్ కు సీక్వెల్ హీరోయిన్ గానూ పేరుంది. విక్ర‌మ్-హ‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ సామి 2.. లింగుస్వామి-విశాల్ పందెంకోడి 2ల్లో కీర్తిసురేష్  హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇకిప్పుడు విజ‌య్-మురుగ‌దాస్ సినిమాలోనూ కీర్తిసురేష్ నే తీసుకున్నారు. ఈ విష‌యంపై తాజాగా క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. విజ‌య్ తో గ‌తంలోనే భైర‌వా సినిమా చేసింది కీర్తి. ఈ చిత్రం ఫ్లాప్. అయినా కూడా మ‌రోసారి ఈ భామ‌తోనే జోడీ క‌డుతున్నాడు ఇళ‌య ద‌ళ‌ప‌తి. మొత్తానికి ఈ భామ దూకుడు చూసి సీనియ‌ర్ హీరోయిన్లంతా షాక్ అయిపోతున్నారు.

More Related Stories