English   

కోడితే.. న‌వంబ‌ర్ కు వెళ్లిన జ‌వాన్..!

Koditey-Navomber-Ku-Vellina-Jaawan

ఎవ‌ర్ని మాత్రం అని ఏం లాభం.. ఇప్పుడు సాయిధ‌రంతేజ్ అదృష్టం బాలేదంతే..! ఏడాది కింది వ‌ర‌కు వ‌ర‌స‌గా విజ‌యాల‌తో దూసుకుపోతున్న మెగా మేన‌ల్లుడికి తిక్క సినిమాతో బ్రేకులు ప‌డ్డాయి. ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయిన త‌ర్వాత విన్న‌ర్ తో మ‌రో షాక్ తిన్నాడు సాయి. ఈ రెండు ఫ్లాపుల ప్ర‌భావం ఇప్ప‌టికైతే సాయిపై పెద్ద‌గా ప‌డ‌లేద‌నే చెప్పాలి. వీటిని మరిపించ‌డానికి జ‌వాన్ తో త్వ‌ర‌గానే రావాల‌నుకున్నాడు సాయిధ‌రంతేజ్. కానీ కాల‌మే ప‌రీక్షిస్తుంది ఈ కుర్రాన్ని. కానీ జ‌వాన్ ఔట్ పుట్ మాత్రం ఆశించిన‌ట్లుగా రాలేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

జ‌వాన్ తెర‌కెక్కించిన తీరు దిల్ రాజుకు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో చాలా భాగం క‌న్ఫ్యూజింగ్ గా ఉంద‌ని.. మ‌ళ్లీ రీ షూట్లు చేయ‌డానికైనా.. రిపేర్లు చేయ‌డానికైనా రెడీగా ఉండండి అన్న‌ట్లు దిల్ రాజు ఎప్పుడో సూచించాడు. ఇప్పుడు అనుకున్న‌ట్లుగానే జ‌వాన్ మ‌ళ్లీ రీషూట్ చేస్తున్నారు. అందుకే ముందుగా అనుకున్న‌ట్లు ఆగ‌స్ట్ 11న గానీ.. సెప్టెంబ‌ర్ 1న కానీ సినిమా రాలేదు. అన్నీ కుదిర్తే న‌వంబ‌ర్ 3న జ‌వాన్ విడుద‌ల కానుంది. అది కూడా కుద‌ర‌క పోతే సినిమా ఈ ఏడాది రావ‌డం కూడా క‌ష్ట‌మే.

More Related Stories