English   

ల‌వ‌కుశ‌ను ముంచినా తేల్చినా జై ఒక్క‌డే.. 

Lava-Kusa-Nu-Munchina-Telina-Jai-Okkade

ఈ త‌రంలో మంచి న‌టుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే అది ఒక్క ఎన్టీఆర్ మాత్ర‌మే అని చాలా మంది ఒప్పుకుంటారు. ఎలాంటి పాత్ర‌లోకైనా ఇట్టే దూరిపోతాడు జూనియ‌ర్. ఇక ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు స‌రిపోయే పాత్ర ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఒక‌టే టాపిక్ న‌డుస్తుంది. అదే జై ల‌వ‌కుశ ట్రైల‌ర్.. అందులో ఆయ‌న చేసిన జై పాత్ర‌. ఆ పాత్ర‌ ఇప్పుడు ఓ సంచ‌ల‌నంగా మారిపోయింది. స‌ముద్ర‌మంత ధైర్యం ఉండాలా.. ఉందా అంటూ రావ‌ణుడిలా రెచ్చిపోయాడు ఎన్టీఆర్. ఘ‌ట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా నేను రెడీ అంటూ ర‌చ్చ చేస్తున్నాడు యంగ్ టైగ‌ర్. ఈ డైలాగులు చెప్పిన తీరుకే అంతా ఫ్లాట్ అయిపోయారు. ఇక ఇండ‌స్ట్రీలో కూడా అంతా ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయారు. అస‌లేంటి ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఈ చిత్ర విజ‌యాన్ని డిసైడ్ చేసేది మ‌రో మాట లేకుండా జై పాత్రే అని ఒప్పుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. అభిమానులు కూడా మిగిలిన రెండు పాత్ర‌ల్ని కాకుండా ఆ విల‌న్ రోల్ ఎలా ఉండ‌బోతుందా అని వేచి చూస్తున్నారు. మ‌రి ఈ జై.. ల‌వ‌కుశుల్ని ముంచేస్తాడో తేలుస్తాడో..?

More Related Stories